పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించండి

ABN , First Publish Date - 2022-08-20T05:14:14+05:30 IST

నియోజకవర్గంలోని దళిత, గిరిజనులకు 1972లో ఇచ్చిన జెడ్‌హెచ్‌డీసీ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలంటూ శుక్రవారం రైల్వేకోడూరు అం బేడ్కర్‌ విగ్రహం వద రాష్ట్ర ఎస్సీ కమిషన ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌కు సీపీఐ నేత పండుగోల మణి వినతిపత్రం సమర్పించారు.

పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించండి
ఎస్సీ కమిషన చైర్మన సమస్యలు విన్నవిస్తున్న పండుగోల మణి

రైల్వేకోడూరు, ఆగస్టు 19: నియోజకవర్గంలోని దళిత, గిరిజనులకు 1972లో ఇచ్చిన జెడ్‌హెచ్‌డీసీ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలంటూ శుక్రవారం రైల్వేకోడూరు అం బేడ్కర్‌ విగ్రహం వద రాష్ట్ర ఎస్సీ కమిషన ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌కు సీపీఐ నేత పండుగోల మణి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1972లో అప్పటి కలెక్టర్‌ జెడ్‌హెచడీసీ కింది ఓబులవారిపల్లె మండల పరిధిలో  సుమారు 500 ఎకరాల భూములను ద ళిత, గిరిజనులకు పంపిణీ చేశారన్నారు. ఇప్పటి వరకు ఈ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ కార్యాలయాలు, తహసీల్దార్ల కార్యాలయాలు, ఆర్‌డీవో కార్యాలయాల వద్ద ఆందోళనలు చేసినా ఇంత వరకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ఎస్‌సీ కమిషన్‌ స్పందించి  పాసుపుస్తకాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెన్నరాజుపోడు గ్రామ పంచాయతీ పరిధిలోని గాడివారిపల్లెలో  అరుంధతివాడకు చెం దిన వారి భూములను అగ్రవర్ణాల వారు ఆక్ర మించారన్నారు. ఆ భూములను స్వాధీనం చే యాలన్నారు. ఎస్‌. కొత్తపల్లెకు రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించడంతోపాటు, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు గంగాపూరి సుధాకర్‌, సిగె చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఉర్లగట్టుపోడు గ్రామపంచాయతీ లోని దళితవాడలో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని సామాజిక సేవకుడు మందపాటి శంకరయ్య శుక్రవారం విన్నవించారు.

ఓబులవారిపల్లె: తిరుపతి పర్యటన ముగిం చుకొని బద్వేలు పర్యటనకు వెళుతున్న ఎస్సీ కమిషన చైర్మన మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌కు ఉమ్మడి కడప జిల్లా సమతా సైనిక్‌ దళ్‌ అధ్య క్షుడు చౌడవరం మారుమూడి సుబ్బనరసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్ము చెంగయ్య,  రైల్వే కోడూరు పోలీస్‌స్టేషన దగ్గర స్వాగతం పలి కారు. పలు సమస్యలు విన్నవించారు. సమతా సైనిక్‌దళ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్‌ దాస రి సుబ్రహ్మణ్యం, వీడియో సలహాదారులు పులి వెంకటేష్‌, సింగమాల వెంకటేష్‌, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T05:14:14+05:30 IST