meal for your baby: ఆరోగ్యంగా ఉండాలంటే మీ బిడ్డకు సమతుల్య ఆహారాన్ని ఇవ్వండి..!

ABN , First Publish Date - 2022-10-04T20:09:39+05:30 IST

ఆరు నెలల మైలురాయిని దాటిన తర్వాత ప్రతి తల్లి తన బిడ్డకు ఏ ఆహారాన్ని ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా, బలంగా, బొద్దుగా ఉంటుందనే ఆలోచనలో ఉంటుంది.

meal for your baby: ఆరోగ్యంగా ఉండాలంటే మీ బిడ్డకు సమతుల్య ఆహారాన్ని ఇవ్వండి..!

నవజాత శిశువుకు ఆరునెలల వరకు తల్లిపాలతో పోషకాలతో నిండిన ఆహారంతో జీవిస్తారు. ఈ ఆరు నెలల మైలురాయిని దాటిన తర్వాత ప్రతి తల్లి తన బిడ్డకు ఏ ఆహారాన్ని ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా, బలంగా, బొద్దుగా ఉంటుందనే ఆలోచనలో ఉంటుంది. ఈ ఆత్రుతతో అందరినీ సలహాలు అడుగుతూ ఉంటారు. ఎవరు ఏ ఆహారం బలమని చెపితే అది పిల్లలకు పెట్టేస్తూ ఉంటారు. అసలు పిల్లలకు మొదటిగా ఏ ఆహారం బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది?


ఇదే ఘనపదార్థాలను అందించేందుకు...

వైద్యులు, పెద్దలు చెప్పినట్టు ఘన పదార్థాలు మొదలు పెట్టినప్పుడు ఆ కొత్త రుచులకు శిశివు ఎప్పుడూ ఆశ్చర్యపడుతూనే ఉంటుంది. కాకపోతే బిడ్డకు తినిపించేందుకు తల్లికి కాస్త సహనం అవసరం. అయితే బిడ్డకు ఇచ్చే ఆహారం గుజ్జులా ఉండేలా చూడాలి. అలాగే ఇది నీరులా ఉండకూడదు. దీనితో పాటు ఆహారం పోషకాలతో నిండి ఉండాలి. ఇందులో ఉప్పు, చెక్కెర తక్కువ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా తేనె ను బిడ్డకు దూరంగా ఉంచాలి.


ముఖ్యమైన పోషకాలు..

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, కాల్షియం, విటమిన్లు, ఇనుము అవసరమైన పోషకాలతో శిశువుకు ఆహారం ఇవ్వాలి. శిశువుకు ఇచ్చే ఆహారంలో గోధుమలు, బియ్యం, తృణధాన్యాలు, రాగి వంటి ధాన్యాల రూపంలో ఉండాలి. అయితే మన భారతీయులు ప్రోటీన్ల కోసం పప్పు ధాన్యాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. గుడ్లు, మాంసం, చేపలు, నెయ్యి, వెన్న, నూనెల రూపంలో కొవ్వులు అవసరం. ముఖ్యమైన ఖనిజాలు, పాలు, పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.


ఎంత ఫీడ్ చేయాలి..

పదేళ్ళ లోపు పిల్లలకు 4 నుంచి 5 సార్లు భోజనం అవసరం అవుతుంది. ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండిన శక్తిని అందిస్తుంది. చాలామంది పిల్లల్లో అయోడిన్, జింక్, ఐరన్ సూక్ష్మ పోషకాలు లేకపోవడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది.  ఇది అనారోగ్య కారణం కావచ్చు. సమస్య ఇలానే కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించాలి. 


ఈ అంశాలను గమనించాలి...

1. పిల్లలు పాలు, ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం తప్పనిసరి.

2. అల్పాహారాన్ని తప్పక ఇవ్వాలి.

3. పరిమాణం కంటే పోషకాహారం ప్రాధాన్యతనిస్తుంది.

4. ఏది పడితే అది పెట్టి కడుపు నింపేయవద్దు

5. ఒకే రుచికి అలవాటు చేయవద్దు

6. బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆహారం చాలా ముఖ్యం.

7. నీటిని కూడా తప్పకుండా అందివ్వాలి.

Updated Date - 2022-10-04T20:09:39+05:30 IST