చాణక్యనీతి: విద్యార్థులను ఉత్తములుగా మార్చే విజయ రహస్యలివే..

ABN , First Publish Date - 2022-05-01T13:01:57+05:30 IST

విద్యార్థులు యోగ్యులుగా, విజయవంతులుగా తయారయ్యే రహస్యం...

చాణక్యనీతి: విద్యార్థులను ఉత్తములుగా మార్చే విజయ రహస్యలివే..

విద్యార్థులు యోగ్యులుగా, విజయవంతులుగా తయారయ్యే రహస్యం చాణక్యుడు తెలిపిన జీవన విధానాలలో దాగి ఉంది. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం తమ పిల్లలు యోగ్యులు కావాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లలను యోగ్యులుగా చేయడం ఒక సాధన లాంటిది. తల్లిదండ్రులు పూర్తి అంకితభావంతో పిల్లల విషయంలో బాధ్యతలను నిర్వర్తించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. పిల్లలపై మొదటి నుండి సరైన శ్రద్ధ చూపితే, వారిని యోగ్యులుగా చేయడంతో పాటు, వారిని చెడు అలవాట్లను కూడా రక్షించవచ్చు. ఈ విషయాన్ని ఆచార్య చాణక్య ఒక శ్లోకం ద్వారా తెలిపారు.

మాతా శత్రుః పితా వైరి యేన బాలో న పఠితః ।

న శోభతే సభామధ్యే హంసమధ్యే వకో యధా ।।

చాణక్య నీతి ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి కృషి చేయాలి. పిల్లలకు మంచి చదువులు చెప్పని తల్లిదండ్రులు.. పిల్లలకు శత్రువు కంటే తక్కువ కాదు. ఎందుకంటే జ్ఞానం, విద్య అందకపోవడం వల్ల అటువంటి పిల్లలు భవిష్యత్‌లో ఇబ్బందుల పాలవుతారు.




లల్నాద్ బహవో దోషస్తాడనాద్ బహవో గుణః ।

తస్మాత్పుత్ర చ శిష్యం చ తాడయేన్నతులాలయేత్ ।।

చాణక్య నీతి ప్రకారం తల్లిదండ్రులు అధికంగా గారాబం చేయడం వల్ల పిల్లలను తప్పుడు అలవాట్లను అలవరుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని నివారించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్నిసార్లు కఠినంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. పిల్లలను అర్హులుగా చేయడంలో తల్లిదండ్రుల సలహా, సరైన సంరక్షణ కీలక పాత్ర పోషిస్తాయి. తల్లిదండ్రులు.. పిల్లలకు ఎప్పుడూ మంచి విషయాలు చెప్పాలి. వాటిని ముందుగా తల్లిదండ్రులు అనుసరించాలి. ఎందుకంటే పిల్లల మొదటి పాఠశాల ఇల్లు. అందుకే ఇంటి పరిసరాలను ఎప్పుడూ చక్కగా ఉంచుకోవాలి. తల్లిదండ్రులు సరైన ఆదర్శవంతమైన ప్రవర్తనను కలిగివుండాలి. ఇది పిల్లలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నమంచి లక్షణాలు పిల్లల జీవితంలో అపారమైన విజయాన్ని అందిస్తాయి. 

Updated Date - 2022-05-01T13:01:57+05:30 IST