చితక్కొట్టి రికార్డులకెక్కిన కివీస్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్

ABN , First Publish Date - 2020-11-30T00:56:55+05:30 IST

న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్ రికార్డు సృష్టించాడు. వెసిండీస్‌తో ఈరోజు జరిగిన రెండో టీ20లో చెలరేగిపోయాడు. సిక్సర్లు

చితక్కొట్టి రికార్డులకెక్కిన కివీస్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్

మౌంట్ మాంగనూయి: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్ రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో ఈరోజు జరిగిన రెండో టీ20లో చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 46 బంతుల్లోనే సెంచరీ బాదాడు. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీల్లో ఇది పదోది కాగా, న్యూజిలాండ్‌కే చెందిన కొలిన్ మన్రో కంటే ఒక్క బంతి ముందు సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్ 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. డేవోన్ కాన్వే‌తో కలిసి 184 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాన్వే 37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి ఓటమి పాలైంది.  

Updated Date - 2020-11-30T00:56:55+05:30 IST