భారీ నష్టాల్లో గ్లోబల్ క్రిప్టో మార్కెట్‌

ABN , First Publish Date - 2022-01-23T01:59:51+05:30 IST

బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు శనివారం అత్యంత కనిష్ట

భారీ నష్టాల్లో గ్లోబల్ క్రిప్టో మార్కెట్‌

న్యూఢిల్లీ : బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు శనివారం అత్యంత కనిష్ట స్థాయికి కుప్పకూలిపోయాయి. పతనం కొనసాగుతుండటంతో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లు పతనమైంది. 2021 నవంబరులో ఒక బిట్‌కాయిన్ విలువ సుమారు 69,000 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఇది 35,000 డాలర్ల వద్ద కనిపించింది. 


ఎథెరియం, ఫైనాన్స్ కాయిన్, కార్డనో వంటి ఇతర డిజిటల్ కరెన్సీల విలువ కూడా పతనమైంది. సోలానా, డొజ్‌కాయిన్, షిబా ఇను కూడా భారీగా నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండటం, మార్కెట్ నుంచి ఉద్దీపనను ఉపసంహరించే అవకాశం ఉండటంతో క్రిప్టో కరెన్సీల విలువ కుప్పకూలిందని విశ్లేషకులు చెప్తున్నారు. 


అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పరిశోధన వెల్లడించిన విషయం ఏమిటంటే, క్రిప్టోకరెన్సీల విలువలు, చంచలత్వం అత్యధికం కావడంతో పెరుగుతున్న వాటి ఉమ్మడి కదలికలు ఆర్థిక సుస్థిరతకు త్వరలోనే ముప్పు కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలు విస్తృతంగా ఉన్న దేశాల ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుంది. ఈ నేపథ్యంలో సమగ్రమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ నియంత్రణ విధానం అవసరం. ఈ విధానం ద్వారా వివిధ దేశాల్లోని జాతీయ నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థలకు మార్గదర్శనం చేయాలి. తద్వారా క్రిప్టోకరెన్సీ వ్యవస్థ నుంచి ఆర్థిక స్థిరత్వానికి ఎదురయ్యే నష్టాలను తగ్గించాలి. 


Updated Date - 2022-01-23T01:59:51+05:30 IST