Global pollution కాటుకు ఏటా 9 మిలియన్ల మంది బలి

ABN , First Publish Date - 2022-05-18T18:00:54+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9 మిలియన్ల మరణాలకు అన్ని రకాల కాలుష్యం కారణమని తాజా అధ్యయనంలో వెల్లడైంది....

Global pollution కాటుకు ఏటా 9 మిలియన్ల మంది బలి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9 మిలియన్ల మరణాలకు అన్ని రకాల కాలుష్యం కారణమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కార్లు, ట్రక్కులు, పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత గాలి కారణంగా మరణాల సంఖ్య 2000 నుంచి 55శాతం పెరిగింది.ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌ తాజా అధ్యయనం ప్రకారం బంగ్లాదేశ్, ఇథియోపియా దేశాల్లో కాలుష్యం కారణంగా 1,42,883 మరణాలు సంభవించాయి. 142,883 మరణాలతో మొత్తం కాలుష్య మరణాల్లో టాప్ 10 దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ 7వ స్థానంలో ఉంది.భారతదేశం, చైనా దేశాలు కాలుష్య మరణాల్లో ముందున్నాయి. సిగరెట్‌ స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి పెద్దసంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని అధ్యయనం తెలిపింది.కాలుష్యం కాటుకు 9 మిలియన్ల మరణాలు సంభవించాయని గ్లోబల్ పొల్యూషన్ అబ్జర్వేటరీ డైరెక్టర్ ఫిలిప్ లాండ్రిగన్ చెప్పారు.


Updated Date - 2022-05-18T18:00:54+05:30 IST