ఘనంగా అబ్దుల్‌కలాం జయంతి

ABN , First Publish Date - 2021-10-17T06:17:17+05:30 IST

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జయంతి, వార్తాపత్రికల అమ్మకందారుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమా న్ని నగరంలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో న్యూస్‌ పేపర్‌ సప్లయిర్‌ అసొసియేషన్‌ ఆధ్వ ర్యంలో శనివారం నిర్వహించారు.

ఘనంగా అబ్దుల్‌కలాం జయంతి
అబ్దుల్‌కలాం జయంతిని నిర్వహిస్తున్న సభ్యులు

నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబరు 16: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జయంతి, వార్తాపత్రికల అమ్మకందారుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమా న్ని నగరంలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో న్యూస్‌ పేపర్‌ సప్లయిర్‌ అసొసియేషన్‌ ఆధ్వ ర్యంలో శనివారం నిర్వహించారు. అబ్దుల్‌కలాం చిన్నతనంలో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఒక శాస్త్రవేత్తగా ఎదగడంతో పాటు భారత రాష్ట్రపతి అయ్యా రని, జిల్లా అధ్యక్షుడు సత్యం అన్నారు. అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకుని ప్రతీఒక్కరు ముందుకుపోవాలన్నారు. చలిని, వర్షాన్ని లెక్కచేయకుండా 361 రోజులు వార్తపత్రికలు పంపినీ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని న్యూస్‌పేపర్స్‌ సప్లై అసోసియేషన్‌ కోశాధికారి శ్రీనివాస్‌, సభ్యులు రమేష్‌ అన్నారు. కరోనా సమయంలో కూడా ఇంటింటికి పత్రికను సరఫరా చేశామన్నా రు. ప్రభుత్వం పత్రికల అమ్మకందారులకు, సప్లైదారులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మికాంతం, సాయి, వరుణ్‌, రాజు, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని పురష్కరించుకొని సామాజిక కార్యకర్త జీనియస్‌ గంగారెడ్డి ధర్మారం(బి)లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రెటరీ అరుంధతి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:17:17+05:30 IST