ఘనంగా ఆడారి ఆనంద్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-01-21T06:22:39+05:30 IST

విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌, వైసీపీ నేత ఆడారి ఆనంద్‌కుమార్‌ జన్మదిన వేడుకలను గురువారం ఎలమంచిలిలో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు.

ఘనంగా ఆడారి ఆనంద్‌ జన్మదిన వేడుకలు
ఆనంద్‌కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న వెంకట్‌, నేతలు...


 కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తును సేవా కార్యక్రమాలు

ఎలమంచిలి, జనవరి 20: విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌, వైసీపీ నేత ఆడారి ఆనంద్‌కుమార్‌ జన్మదిన వేడుకలను గురువారం ఎలమంచిలిలో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ఈ సందర్భంగా తులసీ థియేటర్‌ వద్ద మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి, మాజీ జడ్పీటీసీ ఆడారి శ్రీధర్‌, యల్లపు నాగరాజు కేక్‌ కట్‌చేశారు.అనంతరం పేదలకు అన్నదానం చేపట్టారు. రమాకుమారి స్వగృహం వద్ద సుమారు రెండు వేల మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆనంద్‌ ప్రధాన అనుచరుడు ఆడారి వెంకట్‌ ఆధ్వర్యంలో కొక్కిరాపల్లి ప్రేమసమాజంలో అనాథలకు, పేదలకు, సీహెచ్‌సీలోని రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం ఆనంద్‌ అభిమానులంతా విశాఖకు వెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ఆడారి వెంకట్‌తో పాటు డి.కృష్ణ, బొడ్డేటి సురేష్‌, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ ములంపాక నానాజీ, కొలగాని అప్పలనాయుడు, బి.వెంకటరమణ, జె.అప్పారావు, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ మళ్ల కొండబాబు, కె.జానకీరామ్‌, రిటైర్డు లెక్చరర్‌ ఎ.పూరీజగన్నాథం పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:22:39+05:30 IST