ఘనంగా దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T04:35:09+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా దసరా వేడుకలు
చేర్యాలలో రావణ దహనం

 పలు గ్రామాల్లో రావణ దహనం

 ముగిసిన నవరాత్రి ఉత్సవాలు


గజ్వేల్‌/హుస్నాబాద్‌/దుబ్బాక/మిరుదొడ్డి/వర్గల్‌/ కొండపాక/రాయపోల్‌/చేర్యాల/ములుగు/మద్దూరు/చిన్నకోడూరు/తొగుట/జగదేవపూర్‌, అక్టోబరు 16: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పాలపిట్ట దర్శనం కోసం గ్రామశివారులకు వెళ్లారు. భక్తులందరూ ఆలయాలకు వెళ్లి జమ్మిపూజ నిర్వహించి బంధువులకు, స్నేహితులకు అందజేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయుధ పూజ నిర్వహించారు. పలు గ్రామాల్లో రావణుడి చిత్రపటాలను దహనం చేశారు. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని గ్రామాల్లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్గల్‌ మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో విజయదశిమి పర్వదినం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వర్గల్‌ మండల కేంద్రంలో సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రావణ దహనకాండ నిర్వహించారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా అందంగా బతుకమ్మలను పేర్చిన వారికి బహుమతులను అందజేశారు. కొండపాక మండలం మర్పడగ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో నిర్వాహకుడు చెప్పెల హరనాథ్‌శర్మ జమ్మి వృక్షానికి పూజలు చేసి ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, సర్పంచ్‌ రజితరాజిరెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్‌ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజ్వేల్‌ పట్టణంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, మహంకాళీ ఆలయ అధ్యక్షుడు శ్రీధర్‌రావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ రామాలయం వద్ద జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రావణాసురుడి చిత్రపటాన్ని దహనం చేశారు. ప్రజ్ఞాపూర్‌లో రామ్మోహన్‌రావు, లింగారెడ్డి, సాయిరెడ్డి, కౌన్సిలర్‌ వరలక్ష్మికనకయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీ, కౌన్సిలర్లు చందు, బాలమణి, శిరీషరాజు, చందనరవిందర్‌, రజిత, బాలేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి దౌల్తాబాద్‌ మండలంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాయపోల్‌ మండలం వడ్డేపల్లిలో సర్పంచ్‌ బచ్చు చంద్రశేఖర్‌ పాలపిట్టను ఎగురవేశారు. దౌల్తాబాద్‌ మండలం అప్పాయపల్లిలో ఎల్లమ్మ నాటకం వేశారు. ఎల్లమ్మగా కాయిత స్వామి, పరశురాముడిగా పోసాని సత్తయ్య, శంకరుడిగా రాజోలు అంజనేయులుతో పాటు వివిధ పాత్రల్లో రమేష్‌, గణేష్‌, నర్సింలు, వెంకటేష్‌, రాజు నటించారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేర్యాల పట్టణంలోని అయ్యప్ప, ఆభయాంజనేయస్వామి ఆలయాల వద్ద రావణాసురవధ చేపట్టారు. చేర్యాల పోలీ్‌సస్టేషన్‌లో సీఐ భీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఐ రాకేశ్‌ ఆయుధపూజ నిర్వహించారు. కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి ఆయుఽధపూజ చేశారు. నాగపురిలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, సర్పంచ్‌ బండమీది సంతోషికరుణాకర్‌, ఆయా గ్రామాల్లో సర్పంచులు పెడుతల ఎల్లారెడ్డి, కొండపాక భిక్షపతి, కత్తుల కృష్ణవేణి, ఎర్రబెల్లి రాంమోహన్‌రావు, ఏనుగుల దుర్గయ్య, బొడ్డు స్వప్నకిరణ్‌ తదితరులు వేడుకలలో పాల్గొన్నారు. కొమురవెల్లిలో జడ్పీటీసీ సిలివేరి సిద్దప్ప, మర్రిముచ్ఛాల గ్రామంలో ఎంపీపీ తలారి కీర్తనకిషన్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, మర్రిముచ్ఛాలలో సర్పంచ్‌ బొడ్గం పద్మ, లెనిన్‌నగర్‌లో సనాది సబిత, కిష్టంపేటలో భీమనపల్లి కరుణాకర్‌, రాంసాగర్‌లో తాడూరి రవీందర్‌, అయినాపూర్‌లో చెరుకు రమణారెడ్డి, రసూలాబాద్‌లో పచ్చిమడ్ల స్వామి వేడుకల్లో పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో బాలాజీశర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, స్థానాచార్యుడు పడిగన్నగారి మల్లయ్య, ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌, అర్చకసంఘం అధ్యక్షుడు పడిగన్నగారి ఆంజనేయులు, అర్చకులు విజయ్‌కుమార్‌, సాంబయ్య, మల్లికార్జున్‌ పాల్గొన్నారు. ములుగు మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్‌,  జడ్పీటీసీ జయమ్మఅర్జున్‌గౌడ్‌, సర్పంచ్‌ బట్టు మాధవిఅంజిరెడ్డి పాల్గొన్నారు. 


హుస్నాబాద్‌ పట్టణంలోని మరకత లింగేశ్వరస్వామి ఆలయం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో జమ్మి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, మాజీ చైర్మన్‌ సుద్దాల చంద్రయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, స్ఫూర్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు పందిల్ల శంకర్‌, కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, బోజు రమాదేవి, కోమటి స్వర్ణలత, పెరుక భాగ్యారెడ్డి, దొడ్డి శ్రీనివాస్‌, చిత్తారి పద్మ, వల్లపు రాజు, గోవిందు రవి, వాల సుప్రజ, ఎండి అన్వర్‌, చిట్టి గోపాల్‌రెడ్డి, డాక్టర్‌ రవీందర్‌, ఎండి అయూబ్‌ పాల్గొన్నారు. మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. గడీ మైసమ్మ వద్ద సర్పంచ్‌లు మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో రంగనాయక స్వామి విగ్రహంతో పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సర్పంచ్‌ చంద్రకళ, ఉప సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ చంద్రమౌళి, పీఏసీఏస్‌ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T04:35:09+05:30 IST