ఘనంగా దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T05:03:19+05:30 IST

విజయదశమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బారంబావి వద్ద రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది.

ఘనంగా దసరా వేడుకలు
పేట సెంట్రల్‌ చౌక్‌లో దుర్గామాత విగ్రహం ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, చిట్టెం

శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు 

భారీగా తరలివచ్చిన ప్రజలు

నారాయణపేట, అక్టోబరు 16 : విజయదశమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బారంబావి వద్ద రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. శుక్రవారం సాయంత్రం వీహెచ్‌పీ, ఆర్య సమాజం ఆధ్వర్యంలో కాషాయ జెండాల ఊరేగింపుతో బారంబావి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీతో పాటు వీహెచ్‌పీ, ఆర్య సమాజం ప్రము ఖులు మాట్లాడారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రావణాసురుడి చిత్ర పటాన్ని దహనం చేసి ఒకరినొకరు శమీ పత్రాన్ని ఇచ్చి పుచ్చుకొని విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి స్వగ్రామమైన షేర్‌ వెంకటాపూర్‌ లో శమ్మీ వృక్షానికి పూజలు నిర్వహించారు. అనంతరం శమ్మీ పత్రాలను సేకరించారు.

దుర్గామాత విగ్రహాల ఊరేగింపు

దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ చౌక్‌బజార్‌లో ఎస్‌ఎస్‌కే సమాజం ధూల్‌పేట్‌, బజరంగ్‌ దళ్‌ యువజన సంఘం, బాపూనగర్‌లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాల ఊరేగింపు శనివారం కనుల పండుగగా కొనసాగింది. అంతకుముందు దుర్గామాత విగ్రహాలకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల కోలాటాలు, భజనలు, యువత ఆనందోత్సవాల మధ్య టపాసుల మోతతో ఊరేగింపుగా కొండారెడ్డిపల్లి చెరువుకు తరలించారు. అనంతరం దుర్గామాత విగ్రహాలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆయా ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

కిక్కిరిసిన మహంకాళీ ఆలయం

విజయ దశమి పర్వదినాన పేట పట్టణంలోని మ హంకాళీ దేవాలయంలో మహిళలు, భక్తులతో శుక్రవా రం కిక్కిరిసింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో జోషి రఘుప్రేమ్‌ శ్రీనివాస కళ్యా ణం చేశారు. ఎక్లాస్‌పూర్‌ మాణిక్‌ శాస్ర్తీ తన నివాసం లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. 

నర్వ : దసరా పండుగను పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద సర్పంచ్‌ పెద్దింటి సంధ్య ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జమ్మికొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరూ జమ్మిని పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అడుగుల భజన ఆకట్టుకున్నది. కార్యక్ర మంలో ఉప సర్పంచ్‌ నర్సింహ్మరెడ్డి, రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

మాగనూర్‌ : దసరా పండుగను పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల ప్ర జలు శమీ వృక్షానికి, ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి పత్రిని ఒ కరినొకరు ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ శ్యామల, సర్పంచ్‌లు రాజు, మంజుల, రాఘవేంద్ర, తారమ్మ, నిర్మలాదేవి, అశోక్‌గౌడ్‌, నారాయణ, తిమ్మప్ప, అంజనమ్మ, ఎంపీ టీసీలు ఎల్లారెడ్డి, శ్యామలదేవి పాల్గొన్నారు. 

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని ముసలాయి పల్లి, దాసర్‌పల్లి, పంచదేవపహాడ్‌, పంచలింగాల్‌, చిన్న గోప్లాపూర్‌, వనాయకుంట, అనుగొండ, మాద్వార్‌, రుద్ర సముద్రం గ్రామాల్లో శుక్రవారం దసరా పండుగ వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శమీ వృక్షానికి పూజలు నిర్వహించి ఒకరికొకరు జమ్మీ పం చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

మక్తల్‌ : పట్టణంలోని రాంలీలా మైదానంలో శుక్రవారం విజయదశమి వేడుకలను ఘనంగా జరుపు కున్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయ కుడు కొండయ్య, వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డి శమీ పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తుల ఆనందోత్సవాల మధ్య రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా వేంకటేశ్వరస్వామి దేవాలయంలో రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్లజానమ్మ ఆలయం వద్ద భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సురేష్‌కుమార్‌, భాస్కర్‌, వెంకటేష్‌, నాగరాజు, హరికృష్ణ పాల్గొన్నారు. 

మరికల్‌ : మండలంలో శుక్రవారం దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకరికొకరు జమ్మి పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంత కుముందు యువకమండలి ఆధ్వర్యంలో రావణాసురిడి దహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సురేఖరెడ్డి, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, యువక మండలి అధ్యక్షుడు ఆంజనేయులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. 

నారాయణపేట టౌన్‌ : దామరగిద్ద మండలంలో దసరా పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంజీవరాయ దేవాలయ సమీ పంలో శమీ వృక్షానికి ప్రత్యేక పూజల అనంతరం జమ్మి ఆకును ఒకరికొకరు పంచుకొని శుభా కాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షుడు ఈదప్ప, మాజీ సర్పంచ్‌ భీమయ్య గౌడ్‌, బసంత్‌రాజ్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

కృష్ణ : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో దసరా పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకు న్నారు. ఈ సందర్భంగా వేద పండితులు శేషభట్‌, నారాయణభట్‌ ఆధ్వర్యంలో శమీ వృక్షానికి పూజలు నిర్వ హించి జమ్మి పత్రిని ఒకరినొకరు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అంజనమ్మపాటిల్‌, సర్పంచ్‌లు రేణుక, రాధ, ఈడిగి శంకరమ్మ, రామకృష్ణ, శివప్ప, సావిత్రి, లక్ష్మీ నారాయణ గౌడ్‌, ఎంపీటీసీలు రామచంద్ర, శారద, నాయకులు సోమశేఖర్‌ గౌడ్‌, శివరాజ్‌పాటిల్‌, మోనేశ్‌, విజయప్పగౌడ, అబ్దుల్‌ఖాదర్‌, శివశంకర్‌, నాగప్ప, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అదే విధంగా మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి మండలంలోని కుసుమూర్తి, చేగుంట, ఐనాపూర్‌, సుకుర్‌లింగంపల్లి, టైరోడ్‌ గ్రామాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజల నిర్వహిం చారు. కార్యక్రమంలో జగదబిరెడ్డి, మాగనూర్‌, కృష్ణ మండలాల టీడీపీ అధ్యక్షులు రవీందర్‌, రాకేష్‌, కోఆప్షన్‌ సభ్యుడు యాకుబ్‌అలీ, మాగనూర్‌ పట్టణ టీడీపీ అధ్యక్షుడు నరేష్‌, నాయకులు మధుసూదన్‌రెడ్డి, అనిల్‌ గౌడ్‌, భీమేష్‌, విష్ణు, మండల ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్‌, రాములు, మండల ఉపాధ్యక్షుడు వర్కుర్‌ అంజి, రవి, మహాదేవ్‌, మారెప్ప, నాగరాజు, వెంకట్‌ పాల్గొన్నారు.

 ఊట్కూర్‌ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని బిజ్వార్‌లో శనివారం దుర్గమాత నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా దుర్గమాత మాలను ధరించిన స్వాములు ఆడుతూ పాడుతూ ఊరేగింపు నిర్వహించారు.  అనంతరం వల్లపురంకు తీసుకెళ్లి కృష్ణనదిలో నిమజ్జనం చేశారు. 

 మద్దూర్‌ : దసరా సంబురాలను మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వద్ద శమీ వృక్షానికి పూజలు నిర్వహించి జమ్మి ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్ష లు తెలుపుకున్నారు. సర్పంచ్‌ అరుణ, జడ్పీటీసీ రఘు పతిరెడ్డి, మాజీ జడ్పీటీసీలు సలీం, బాల్‌సింగ్‌, కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గవినోళ్ల వీరారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షడు వీరారెడ్డి, గౌడ సంఘం తా లూకా అధ్యక్షడు వీరేశ్‌గౌడ్‌, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అనిత, శిరీష, రేఖ, భారతి, తిరుపతి, మనోజ్‌, వెంకటయ్య, వెంకటేశ్‌, మాజీ ఎంపీపీ సంగీత, నాయకులు బస్పప్ప, భీములు, మహేందర్‌, పురుషోత్తం, జనార్ధన్‌, సంజీవ్‌ వేడుకాల్లో పాల్గొన్నారు. అంతకుముందు శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు.


Updated Date - 2021-10-17T05:03:19+05:30 IST