ఘనంగా ఐఐపీఈ మొదటి స్నాతకోత్సవం

ABN , First Publish Date - 2022-01-22T06:19:40+05:30 IST

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.

ఘనంగా ఐఐపీఈ మొదటి స్నాతకోత్సవం
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు జ్ఞాపిక అందజేస్తున్న ఐఐపీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌

ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరు

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. సిరిపురం వద్ద గల వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో శుక్రవారం నిర్వహించిన ఈ  కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్‌ పెరుగుతోందని,  ఈ నేపథ్యంలో పెట్రోలియం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి వున్న అడ్డంకులను అధిగమించాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ను వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి, రాష్ట్ర మంత్రి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T06:19:40+05:30 IST