ఘనంగా మహేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2021-05-09T04:55:51+05:30 IST

డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం నియోజకవర్గ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మహేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు
మహేందర్‌రెడ్డి దంపతులను గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు

యాదాద్రి రూరల్‌, మే 8: డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం నియోజకవర్గ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులకు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సన్మానంచేశారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వసుపరి శంకరయ్య, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మిట్ట వెంకటయ్యగౌడ్‌,  జడ్పీటీసీ తోటకూరి అనురాధబీరయ్య, సర్పంచ్‌ తోటకూరి బీరయ్య, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. వంగపల్లి గ్రామంలో మహేందర్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కేక్‌కట్‌ చేశారు. 

రాజాపేట: రాజాపేట మండలంలోని రాజాపేట, నర్సాపూర్‌ తదితర గ్రామాల్లో మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో హమాలీ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగిర్తి రాజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, సందెల భాస్కర్‌, ఎర్రగోకుల జశ్వంత, గోపాల్‌ పాల్గొన్నారు. 

ఆత్మకూరు(ఎం): గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరె భిక్షపతి, ఎంపీటీసీ వై.కవిత, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు డి.ప్రవీణ్‌రెడ్డి, ఎస్‌.అరుణ, బి.శేఖర్‌, నాగరాజు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ జె.నగేష్‌ మహేందర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆలేరు: గొంగిడి మహేందర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ చైర్మన గడ్డమీది రవీందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌లోని హమాలీ కార్మికులకు మార్కెట్‌ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్యాదపాక నాగరాజు, చంద్రశేఖర్‌, గంగుల శ్రీనివాస్‌, మెరిగాడి వెంకటేష్‌ పాల్గొన్నారు.  

తుర్కపల్లి, బొమ్మలరామారం:  గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదినోత్సవం వేడుకలను తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు.  కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ చైర్మన ధానావతు బీకునాయక్‌ గూదె బాల్‌నర్సింహ, పోలగౌని వెంకటేశగౌడ్‌, భరతగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T04:55:51+05:30 IST