ఘనంగా మట్టెద్దుల అమావాస్య

ABN , First Publish Date - 2022-06-30T04:46:33+05:30 IST

నారాయణపేట జిల్లాలో రైతులు మట్టెద్దుల అమావాస్యను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వర్షాలు బాగా కురిసి, పంటలు పండాలని వివిధ వర్గాలవారు పూజలు చేశారు.

ఘనంగా మట్టెద్దుల అమావాస్య
మట్టితో చేసిన ఎద్దులు, రైతు ప్రతిమలు

 నారాయణపేట, జూన్‌ 29: నారాయణపేట జిల్లాలో రైతులు మట్టెద్దుల అమావాస్యను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వర్షాలు బాగా కురిసి, పంటలు పండాలని వివిధ వర్గాలవారు పూజలు చేశారు. ఏరువాక పౌర్ణమి అనంతరం వచ్చే ఈ అమావాస్య రోజు కుమ్మరులు ఒండ్రు మట్టితో తయారు చేసిన మట్టెద్దులను విక్రయిస్తారు. రైతులు, పొలాలు ఉన్నవారు కొనుగోలు చేసి, వాటిని గరక, పూలు, పసుపు, కుంకుమతో అలంకరించారు. అనంతరం పూజలు చేశారు. భక్షాలు, ఇతర తీపి వంటకాలను చేసుకొని ఆరగించారు. కర్నాటక సరిహద్దులో ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Updated Date - 2022-06-30T04:46:33+05:30 IST