ఘనంగా ఎమ్మెల్యే ఫాల్గుణ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-03-01T06:27:22+05:30 IST

మండల కేంద్రంలోని జీసీసీ గోడౌన్‌ ఆవరణలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఎమ్మెల్యే ఫాల్గుణ జన్మదిన వేడుకలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఫాల్గుణ


పెదబయలు, ఫిబ్రవరి 28: మండల కేంద్రంలోని జీసీసీ గోడౌన్‌ ఆవరణలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫాల్గుణ   కేక్‌ కట్‌ చేసి పలువురు నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బతికినంత కాలం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు జి.సూరయ్య, అజయ్‌, భాస్కరరావు రాజు, ముంచంగిపుట్టు మండలం బాబుసాల సర్పంచ్‌ స్వతంత్ర అభ్యర్థిని మఠం బంగారమ్మ, మరో ఐదుగురికి  వైసీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వి.ఆనందరావు, పాంగి సింహాచలం, బొంజుబాబు, రూడకోట సర్పంచ్‌ కంతరి సురేశ్‌కుమార్‌, పర్రెడ సర్పంచ్‌ సీహెచ్‌. రవికుమార్‌  పలువురు నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:27:22+05:30 IST