Advertisement

వైభవోపేతంగా ముజ్గిమల్లన్న జాతర

Feb 28 2021 @ 00:59AM
యాదవులు సన్మానించిన తలపాగాతో మంత్రి

ఆలయాన్ని సందర్శించిన మంత్రి అల్లోల

నిర్మల్‌ రూరల్‌, ఫిబ్రవరి 27 : నిర్మల్‌ మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మల్లన్న జాతర  ఆలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శనివారం రోజు సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే మల్లన్న జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొంటారన్నారు. వారికి కావలసిన అవసరాలను గమనిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లన్న స్వామికి ప్రత్యేకపూజలు జరిపించారు. ఆ గ్రామ సర్పంచ్‌ మల్లేష్‌ యాదవ్‌ మంత్రిని యాదవుల దుస్తులతో సత్కరించారు. మల్లన్న జాతర నేటితో కల్యాణం, సల్ల అంబళ్లు కార్యక్రమం ముగుస్తుంది అన్నారు. రేపు జరిగే మహాజాతరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహరాష్ట్ర నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవడం జరుగుతుందన్నారు. భక్తుల కోసం ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేశామని ఆ గ్రామ సర్పంచ్‌ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, నిర్మల్‌ మండల ఎంపీపీ  రామేశ్వర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
Advertisement