ఘనంగా నారా లోకేష్‌ పుట్టిన రోజు

ABN , First Publish Date - 2021-01-24T05:53:05+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజును జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై అభిమానులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేక్‌ను పంపిణీ చేశారు.

ఘనంగా నారా లోకేష్‌ పుట్టిన రోజు
కేక్‌కట్‌ చేస్తున్న విజయనగరం టీడీపీ ఇన్‌చార్జి అతిది గజపతిరాజు

విజయనగరం రూరల్‌ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజును జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై అభిమానులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేక్‌ను పంపిణీ చేశారు. అనంతరం పేర్లవారు వీధిలోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులను దత్తత తీసుకుని ఒక్కో విద్యార్థికి రూ.6 వేలు చొప్పున సాయం అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఐవీపీ రాజు, బొద ్దల నర్సింగరావు, విజ్జపు ప్రసాద్‌, కనకల మురళీమోహన్‌,  మురళీనాయుడు, కర్రోతు నర్సింరావు, జి.రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:53:05+05:30 IST