Advertisement

ఘనంగా నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

Jan 24 2021 @ 01:43AM
రాయదుర్గంలో కేక్‌ తినిపిస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఘ నంగా నిర్వహించారు. లోకేష్‌ యువజన ఫౌండేషన అధ్యక్షుడు చారికి పాలయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి,  పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కేక్‌ క ట్‌ చేశారు. నారా లోకేష్‌ పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ముందుకెళుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, కాలవ సన్నణ్ణ, హనుమంత రెడ్డి, మారెన్న, నాగరాజు, రంగప్ప, మురళి, వాల్మీకి అశోక్‌ పాల్గొన్నారు. 


గుంతకల్లు టౌన : స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో  నాయకులు ఆర్‌ పవనకుమార్‌ గౌడు, అనిల్‌ గౌడు, ముక్కన్న గారి రామాంజినేయులు, ప్రతాప్‌ నాయుడు, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, రమేష్‌ గౌడు, నారాయ ణ, పాల మల్లికార్జున, తెలుగు యువత నాయకులు రాము, ఆటో ఖాజ, రామం జి, ఎల్లప్ప, శీన పాల్గొన్నారు.


నిరాశ్రయులకు అన్నదానం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా లోకేష్‌ యువజన ఫౌండేషన నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్‌ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మస్తానయ్య దర్గా వద్ద నిరాశ్రయులు, వృద్ధులకు అన్నదానం చేశారు.   కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, నాయకులు ఆర్‌ పవన కుమార్‌ గౌడు, ముక్కన్నగారి రామాంజనేయులు, బండారు రామన్నచౌదరి, తెలుగు యువత నాయకులు రాము, ఎర్రిస్వామి, మల్లేష్‌, మణి, ఈశ్వర్‌, హేమంత పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం : నారాలోకేష్‌ జన్మదిన వేడుకలను శనివారం స్థానిక ఎన్టీఆర్‌ భవనలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడును స్ఫూర్తి గా తీసుకుని నారా లోకేష్‌ నాయకత్వంలో పనిచేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని ము రళి, బిక్కి గోవిందప్ప, కొల్లప్ప, తలారి సత్యప్ప, రామరాజు, రాజశేఖర్‌చౌదరి,  పోస్టు పాలన్న, నిర్మల, ఎర్రమ్మ, జయరాములు, బ్రహ్మయ్య, నాగరాజు, రామాంజినేయులు, వేలూరి అరవింద్‌, మంజునాథ్‌రెడ్డి, లాల్‌కృష్ణా, హనుమేష్‌, శీన, సు ధాకర్‌నాయుడు, ఆంజినేయులు, బసవరాజు, బ్రిజేష్‌, రాయల్‌ హర్షాపాల్గొన్నారు. 


బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం 

మండలంలోని పాలవాయి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాము ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి నియోజకవర్గ ఇనచార్జి ఉమా చంద్రన్నస్ఫూర్తితో రూ.40వేల ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లల చ దువులు, కుటుంబ పోషణ నిమిత్తం నగదును ఉపయోగించుకోవాలన్నారు.  


ఉన్నం ఆధ్వర్యంలో...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచి పెట్టారు. నారా లోకే్‌షను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమని ఆయన  పేర్కొన్నారు. కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్‌ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ప్రియాంక, నాయకులు ఆర్జీ శివశంకర్‌, డీకే రామాంజినేయులు, గోవిందరెడ్డి, గరికపాటి కిషోర్‌, గోవిందప్ప, రాయపాటి రామాంజినేయులు, కొండన్న, మల్లిపల్లి నారాయణ, కొల్లాపురప్ప,రామన్న, గోళ్ల రాము, చంద్ర, కిషోర్‌ పాల్గొన్నారు.  


జేఏసీ కార్యాలయంలో...

కళ్యాణదుర్గం జేఏసీ కార్యాలయంలో శనివారం నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు చౌళం మల్లికార్జున ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. నారా లోకేష్‌ అడుగుజాడల్లో నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాపంపల్లి రామాంజినేయులు, వైపీ రమేష్‌, గౌని శ్రీనివాసరెడ్డి, ఊటంకి రామాంజినేయులు, అనిల్‌చౌదరి, సాయినాథ్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. 


కంబదూరు: స్థానిక టీడీపీ కార్యాలయం, మాజీ వైస్‌ ఎంపీపీ తలారి ఎర్రిస్వామి స్వగృహంలో శనివారం ఆపార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు మి ఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహనచౌదరి, మాజీ ఎంపీపీ లక్ష్మినారాయణ, జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి సు బ్బరాయుడు, ఎంపీపీ టీడీపీ అభ్యర్థి ములకనూరు తిమ్మరాయుడు, నాయకులు ఆవుల తిప్పేస్వామి, గాజుల శ్రీరాములు, దండా వెంకటేశులు, షఫీ, రామకృష్ణ,   నాగరాజు, గుద్దెళ్ల హరి, మారుతి, ప్రభాకర్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. 


యాడికి: మండలంలోని రాయలచెరువులో శనివారం టీడీపీ నేత నారాలోకేష్‌ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కులశేఖర్‌నాయుడు, వేలూరు జగదీష్‌, మాదాల శ్రీనివాసులునాయుడు, గోపాల్‌నాయుడు, బాబు, నెట్టికంటయ్య, శేఖర్‌, బాషా, గౌస్‌ పాల్గొన్నారు. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.