ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-29T05:54:16+05:30 IST

ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు
నాయకులకు కేక్‌ తినిపిస్తున్న మాజీ ఎంపీ వేణుగోపాలాచారి


కీసర రూరల్‌, మే28:  తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల విస్తరింపజేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు దక్కుతుందని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. శనివారం నాగారం మున్సిపాలిటీ మారుతి గార్డెన్‌లో కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై ఎన్టీ రామారావుకు నివాళులర్పించారు. కేక్‌ను కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి ఎన్టీఆర్‌ చరిత్ర సృస్టించారన్నారు. అధికారం చేపట్టి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. విద్యా వంతులను రాజకీయాల్లోకి ఆహ్వానించి, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తీర్చిదిద్ది, ప్రజలకు సేవలందించే అవకాశం కల్పించారన్నారు. నటుడుగా, రాజకీయ నాయకుడుగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గొప్పతనాన్ని, మంచి తనాన్ని, అయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. అనతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌ మల్లేష్‌, జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివా్‌సరెడ్డి, ముప్పరామారావు,  కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు శ్రీలత, లక్ష్మి, అన్నంరాజ్‌ లావణ్య, అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ సురేష్‌, కాకతీయ సేవా సమితి సభ్యులు శివాజీ, రాంగారావు, నాగేశ్వర్రావు, ఉమాశంకర్‌రావు, శేఖర్‌బాబు, రామారావు, రామకృష్ణ, టీడీపీ నాయకులు కొండా జంగారెడ్డి, ఉమాశంకర్‌, లింగం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:54:16+05:30 IST