ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-06-20T05:22:30+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
మహబూబ్‌నగర్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న నాయకులు

 మహబూబ్‌నగర్‌/భూత్పూర్‌/బాలానగర్‌/అడా ్డకుల, జూన్‌ 19: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్‌ఎస్‌ యూఐ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌అవేజ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మహిళా కాం గ్రెస్‌ ఆధ్వర్యంలో జనరల్‌ ఆస్ప త్రిలో అన్నదానం చేశారు. రెవెన్యూ వార్డులలో పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అబ్దుల్‌హక్‌ ఆధ్వర్యంలో పారి శుధ్య కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లకు నిత్యా వసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడు తూ రాహుల్‌గాంధీ ఆశయ సాధన కోసం యువత పని చేయాలన్నారు. పార్టీని బలోపేతనం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రదీప్‌ కుమార్‌గౌడ్‌, బెక్కరి అనిత, సీజే బెనహర్‌, అన్వర్‌పాష, లక్ష్మణ్‌ యాదవ్‌, జహీర్‌అక్తర్‌, చంద్రశేఖర్‌, సాయిబాబ, నాగరాజు పాల్గొన్నారు. 

 భూత్పూర్‌: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడకలను శనివారం భూత్పూర్‌ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జి.మధు సూదన్‌రెడ్డి సొంత డబ్బులతో 300 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను అందించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చౌరపస్తాలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటనర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాములు, మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సాధిక్‌ పాల్గొన్నారు.

 బాలానగర్‌, జూన్‌ 19: రాహులుగాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మం డల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహిం చారు. కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు.

 డ్డాకుల: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో లాక్‌ డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ఆటో డ్రైవర్లకు మండల పరిధిలోని పొన్నకల్‌ స్టేజీ దగ్గర శనివారం నిత్యావసర సరుకులు, మా స్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొండా జగదీశ్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షఫిహమ్మద్‌, కార్యదర్శి విజయమోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, మూసాపేట అధ్యక్షుడు శెట్టిశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:22:30+05:30 IST