Advertisement

ఘనంగా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

Jan 24 2021 @ 00:18AM
సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు

గణేశ్‌నగర్‌, జనవరి 23: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాలకు,  చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. మేయర్‌ వై సునీల్‌రావు సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సుభాష్‌నగర్‌లో నేతాజీ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మా సైనికులు ఎలగందుల శ్రీధర్‌, మహ్మద్‌ ఇక్బాల్‌, ముద్దసాని సుధాకర్‌ను సన్మానించారు. జిల్లా అధ్య క్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు డి శంకర్‌, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, బోయినిపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు. భాగ్యనగర్‌లో వెస్ట్‌జోన్‌ ఉపాధ్యక్షుడు ఎడమ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నగర కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కుర్రపోచయ్య ఆధ్వర్యంలో 24వ డివిజన్‌లో చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరకాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌ పాల్గొన్నారు. సుభాష్‌నర్‌లోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధానకార్యదర్శి పైడిపల్లి రాజు, కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కె సత్యారావు, వసీంఅహ్మద్‌, సలీమ్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌ రూరల్‌: నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతిని 18వ డివిజన్‌లో బీజేపీ నాయకులు జాడిబాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గసభ్యుడు గుడి పాక రాములు, వెస్ట్‌జోన్‌ కిసా న్‌మోర్చా అధ్యక్షుడు ఎం లక్ష్మి రాజం, కార్యదర్శి సందరాజు, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు వెంకటేష్‌, ఉపాధ్యక్షుడు అప్పాల శ్రీనివాస్‌, చంద్రగిరి వేణు, దుర్గం శ్రీనివాస్‌, మల్లె పూల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. చింతకుంటలో జయంతి వేడుక లను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించినప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బారాజు కేశవరెడ్డి, పొన్నం మహి పాల్‌, దాసరి రవి, కుంబం మధు, మిడిదొడ్డి సతీష్‌, పిట్టల సంజీవ్‌, ఎండి సాజిద్‌, రమావత్‌ శ్రీనివాస్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌ కల్చరల్‌: నగరం లోని ప్రజ్ఞాభారతి కార్యాలయంలో శనివారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిరంజనాచారి, మందల నగేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు గాజుల రవీందర్‌, దేశిని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫజిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీంద ర్‌రెడ్డి నేతాజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. నేతాజీ నాయకత్వ లక్షణాలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సుడా డైరెక్టర్‌ బూక్యా తిరుపతినాయక్‌, సంస్థకార్యదర్శి ఏవీఎన్‌ రాజు, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

కరీంనగర్‌ టౌన్‌: నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దామెర సత్యం డిమాండ్‌ చేశారు. సుభాష్‌నగర్‌లోని నేతాజీ సుభాష్‌ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని పూలమా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బొలుమాల సదా నందం, రాజు, రవీందర్‌, బాలయ్య, రాజశేఖర్‌, లింగయ్య పాల్గొన్నారు.

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా శనివారం రోజు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకల(పరాక్రమ దివస్‌)ను పోలీసులు ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్‌ కేంద్రంలో సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి నేతాజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. కమిషనరేట్‌లోని వివిధ పోలీసు ఠాణాలు, సర్కిల్‌, డివిజన్‌స్థాయి కార్యాలయాల్లో జయంతి వేడుకలను పోలీసు అధికారులు నిర్వహించారు. కార్యక్రమాల్లో అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జీ చంద్రమోహన్‌, సీపీవో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ఉమేష్‌కుమార్‌, సీఐ శ్రీధర్‌, నరేష్‌, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్‌, కిరణ్‌కుమార్‌, తోట మురళి, పోలీసు అధికారులు, మినిస్టీరియల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement