ఘనంగా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

ABN , First Publish Date - 2022-01-24T04:35:30+05:30 IST

సంగారెడ్డిలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి
చిన్నశంకరంపేటలోని చందంపేటలో చంద్రబోస్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న హనుమాన్‌ సేవాసమితి నాయకులు

సంగారెడ్డి అర్బన్‌/జిన్నారం/కంగ్టి/నారాయణఖేడ్‌, జనవరి 23 : సంగారెడ్డిలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కన్వీనర్‌ శ్రీకాంత్‌సాగర్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా ప్రముఖ్‌ మాధవరెడ్డి, నగర్‌ సంఘటన కార్యదర్శి నరేశ్‌, వెంకట్‌, నాని పాల్గొన్నారు. ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ సంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నేతాజీనగర్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి అధ్యక్షుడు శ్రీధర్‌మహేంద్ర పూలమాలవేసి నివాళులర్పించారు. ఉపాధ్యక్షుడు సజ్జద్‌ఖాన్‌, ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌, కార్యవర్గసభ్యులు సాయి పాల్గొన్నారు. అదేవిధంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నాయకులు చంద్రబోస్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వాసు, నాగరాజు, విజయ్‌కుమార్‌, సంగమేశ్వర్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. జిన్నారం మండలంలో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద ఉపసర్పంచ్‌ సంజీవ, మాజీ ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, వార్డుసభ్యులు శ్రీనివా్‌సయాదవ్‌, వివిధ యువజన సంఘాల సభ్యులు పూలమాలవేసి నివాళులర్పించారు. మండల కేంద్రమైన కంగ్టిలోని క్రాంతి చౌక్‌ వద్ద ఆదివారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి నిర్వహించారు. ఎస్‌ఐ అబ్దుల్‌రఫీక్‌, ఎంపీపీ సంగీత వెంకటరెడ్డితో పాటు ప్రముఖులు నేతాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాశీనాథ్‌స్వామి, నగేష్‌, జలీల్‌, అంజిరెడ్డి, రాజు, నందకిషోర్‌, మారుతిగౌడ్‌, గణే్‌షగౌడ్‌, నాగన్న షెట్కార్‌, నర్సారెడ్డి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా నారాయణఖేడ్‌లో ఆర్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్‌ చౌక్‌ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రాంత కార్యకారిణి సభ్యులు రాంప్రసాద్‌, ఖండ కార్యవాహ వడితె ప్రసాద్‌, సంఘం బాధ్యులు పాల్గొన్నారు. కాగా ఏబీవీపీ ఆద్వర్యంలోను నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి నిర్వహించారు. ఏబీవీపీ నాయకులు ఆకాష్‌, నవాజ్‌ పాల్గొన్నారు. నాగల్‌గిద్ద మండలంలోని ఏస్గీ, కర్‌సగుత్తి, వల్లూర్‌ గ్రామాల్లో చంద్రబోస్‌ జయంతి నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేత్రి పండరి, సర్పంచులు రేణుకారాజ్‌పాటిల్‌, సంజీవరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రాథోడ్‌, నాయకులు అంజిరెడ్డి, నందుపాటిల్‌లు పాల్గొన్నారు. మండల కేంద్రమైన రాయికోడ్‌తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకుని యువకులు, పెద్దలు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాగా మండల పరిధిలోని కర్చల్‌, ఇందూర్‌, మామిడిపల్లి, హస్నాబాద్‌ గ్రామాల్లో నివాళులర్పించారు. 

మెదక్‌ జిల్లాలో

చిన్నశంకరంపేట/పెద్దశంకరంపేట/పాపన్నపేట/తూప్రాన్‌ (మనోహరాబాద్‌/రామాయంపేట, జనవరి 23 : చిన్నశంకరంపేట మండలం చందంపేటలో హనుమాన్‌ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం చంద్రబోస్‌ జయంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌, హనుమాన్‌ సేవాసమితి నాయకులు నాగరాజు, శ్రీనివాస్‌, నరేష్‌, ప్రేమ్‌ కుమార్‌, విజయ్‌, దత్తు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్‌ అన్నారు. పెద్దశంకరంపేటలో చంద్రబోస్‌ 125వ జయంతిని ఆర్‌వీఎస్‌ స్వచ్ఛంద సంస్థ, ఆర్‌ఎ్‌సఎస్‌, శిశుమందిరం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. గాంధీచౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఆలుగుల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మురళీపంతులు, బీజేపీ మండలాధ్యక్షుడు కోణం విఠల్‌, ఎంపీటీసీలు వీణాసుభా్‌షగౌడ్‌, స్వప్నరాజేశ్వర్‌, ఆర్‌వీఎస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గంగారెడ్డి, ప్రధానాచార్యులు వీరప్ప, ఆర్‌ఎ్‌సఎస్‌ బాధ్యులు శిశు మందిర్‌ ప్రబంధ కారిణి సభ్యులు దాడిగారి గంగాధర్‌ పాల్గొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో చంద్రబోస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ మండలాధ్యక్షుడు రాములు, జిల్లా నాయకులు ఆకుల సుధాకర్‌, శ్రీనివాస్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. మనోహరాబాద్‌ మండల కేంద్రంలో యువత ఆదివారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని నిర్వహించారు. హైవే పక్కన కూడలి వద్ద ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. రామాయంపేట పట్టణంలో సుభాష్‌ చంద్రబోస్‌ వేడుకలు జరిగాయి. సుభాష్‌ వీధిలో ప్రతిష్టించిన విగ్రహానికి పూలమాల వేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాసు యాదగిరి, కౌన్సిలర్లు నాగరాజు, పోచమ్మల గణేష్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T04:35:30+05:30 IST