వైభవంగా తాళ్లపాక గంగమ్మ జాతర

ABN , First Publish Date - 2022-05-22T05:15:18+05:30 IST

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో శనివారం అంగరంగ వైభవంగా తాళ్లపాక గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఆలయ నిర్మాత పీసీ యోగీశ్వరరెడ్డి, దుర్గాదేవి ఆధ్వర్యంలో గంగమ్మకు సారె సాంగ్యం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూజా సామగ్రిని ఆలయం వద్దకు తీసుకెళ్లి జాతరకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పోతుల రాజు ఊరేగింపు నిర్వహించారు. ఆలయం నుంచి తాళ్లపాక వరకు భారీ ఎత్తున విద్యుత్‌ దీపాలంకరణ చేశారు.

వైభవంగా తాళ్లపాక గంగమ్మ జాతర
తాళ్లపాకలో గంగమ్మకు సారె తీసుకెళుతున్న ప్రజలు

రాజంపేట, మే 21: అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో శనివారం అంగరంగ వైభవంగా తాళ్లపాక గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఆలయ నిర్మాత పీసీ యోగీశ్వరరెడ్డి, దుర్గాదేవి ఆధ్వర్యంలో గంగమ్మకు సారె సాంగ్యం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూజా సామగ్రిని ఆలయం వద్దకు తీసుకెళ్లి జాతరకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పోతుల రాజు ఊరేగింపు నిర్వహించారు. ఆలయం నుంచి తాళ్లపాక వరకు భారీ ఎత్తున విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. ఆదివారం పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శ్యామనబోయిన గౌరీశంకర్‌, ఎంపీటీసీ మధుసూధనవర్మ, మాజీ ఎంపీటీసీ బాలరాజు నవీన, రాజశేఖర్‌రాజు, మధుసూదన్‌రెడ్డి, అర్జున్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా అంకాలమ్మ జాతర 

రాజంపేటటౌన్‌, మే 21: రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలోని అంకాలమ్మ జాతరను కార్యనిర్వాహకులు ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు జాతర నిర్వహించలేదు. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది భారీ ఎత్తున వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి అంకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

Updated Date - 2022-05-22T05:15:18+05:30 IST