ఘనంగా వాసవీమాత జయంతి

ABN , First Publish Date - 2022-05-12T04:06:55+05:30 IST

పట్టణంలో వాసవీ కన్యాక పరమేశ్వరి ఆలయంలో బుధవారం వాసవీమాత జయంతిని ఘనంగా జరుపుకు న్నారు. వాసవీమాత ఉత్సవ విగ్రహంతో ఆల యం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహి ళలు కోలాటం అడుతూ ఊరేగింపులో పాల్గొ న్నారు.

ఘనంగా వాసవీమాత జయంతి
ఆసిఫాబాద్‌లో కోలాటం అడుతున్న మహిళలు

ఆసిఫాబాద్‌, మే 11: పట్టణంలో వాసవీ కన్యాక పరమేశ్వరి ఆలయంలో బుధవారం వాసవీమాత జయంతిని ఘనంగా జరుపుకు న్నారు. వాసవీమాత ఉత్సవ విగ్రహంతో ఆల యం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహి ళలు కోలాటం అడుతూ ఊరేగింపులో పాల్గొ న్నారు. ఆలయంలో ప్రత్యేకపూజలను నిర్వహించారు.

తిర్యాణి: మండల కేంద్రంలో బుధవారం వాసవీ కన్యాకపరమేశ్వరి జయంతి ఉత్సవా లను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

జైనూరు: మండల కేంద్రంలో బుధవారం వాసవీ మాత జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం నాయ కులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాసవీమాత చిత్రపటానికి ప్రత్యేకపూజలు నిర్వ హించారు. 


Read more