ఘనంగా విశ్వకర్మ జయంతి

Sep 17 2021 @ 22:50PM
ఆసిఫాబాద్‌లో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 17: విశ్వకర్మ జయంతిని శుక్రవారం శ్రీపోతులూరి వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. అలయ ఆర్చకుడు ఉపేందర్‌ ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆసంపూ ర్తిగా ఉన్న ఆలయ ప్రహరీనిర్మాణానికి హామీఇచ్చారు. మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, వెంకన్న, సీఐఅకుల ఆశోక్‌, డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి పూజల్లో పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో శుక్రవారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వకర్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వేదపండితులు చేపట్టారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరుకోనప్ప దంపతులు పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow Us on: