ఘనంగా ఓటర్ల దినోత్సవం

ABN , First Publish Date - 2022-01-26T05:27:23+05:30 IST

యువతలో వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మాత్రమే సమాజ ఉన్నతి సాధ్యపడుతుందని ఆర్డీవో లక్ష్మీశివ జ్యోతి అన్నారు.

ఘనంగా ఓటర్ల దినోత్సవం
కస్తూర్బాలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్న విద్యార్థినులు


మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 25: యువతలో వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మాత్రమే సమాజ ఉన్నతి సాధ్యపడుతుందని  ఆర్డీవో లక్ష్మీశివ జ్యోతి అన్నారు. స్థానిక శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్డీవో మాట్లా డారు. క్రియాశీలక యువతే దేశానికి అసలైన బలమన్నారు. ప్రస్తుతం విద్యాలోకం సాంకేతిక మోజులో పడి అధ్యయనాన్ని,  సామర్థ్యాలను, వివేచణశక్తిని విస్మరిస్తోందన్నారు. వ్యవస్థలోని లోపాలను దూషించేకంటే నిజాయితీతో  నూతన సమాజ స్థాపనలో చదువరులు కీలక పాత్ర పో షించాలన్నారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా. కె.మధుసూదన్‌, డిప్యూటీ తహసీల్దార్‌  మంజునాథ్‌రెడి పాల్గొన్నారు.

కిట్స్‌ కళాశాలలో విద్యార్థుల ప్రతిజ్ఞ

కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి అన్నా కృష్ణ చైతన్య  మాట్లాడుతు అతి పెద్ద ప్రజాస్వామ్యం అయిన మన దేశంలో లభించిన శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకొని ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. అనంతరం విద్యార్ధులతో ప్రతిజ్ఞ చే యించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వి.కృష్ణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రంగ నాయకులు తదతరులు పాల్గొన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి

పుల్లలచెరువు :  ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలని తహసీల్దార్‌ కె.దాసు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మండల కేంద్రమైన పుల్లలచెరువులో మంగళవారం  నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ను మార్చే సత్తా ఓటు హక్కుతోనే సాధ్యమని  అన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓ టర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో డీటీ కిరణ్‌, వీఆర్వో డేవిడ్‌,  అధికారులు, ప్రజాప్రతినిధులు, ఓటర్లు పాల్గొన్నారు.

అర్హులందరూ ఓటు హక్కు పొందాలి

ఎర్రగొండపాలెం :  అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.సువర్ణ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  ప్రతిజ్ఞ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటు హక్కు పొందాలన్నారు. ఓటరుగా నమోదు అయిన ఓటర్లు ఎన్నికల సమయంలో నిస్వార్ధంగ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.  ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకొని సమర్ధవంతుడైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ముందుగా బాలికల చేత ఓటర్సు డే ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా విద్యార్థినులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు,  కస్తూ ర్బా ఎస్‌వో తిరుమలదేవి, ఉపాధ్యాయినులు, జూనియర్‌ అసిస్టెంటు బాబు, డీఈవోలు సుబ్బయ్య, బ్రహ్మయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-26T05:27:23+05:30 IST