వైభవం... గొబ్బెమ్మ నిమజ్జనం

ABN , First Publish Date - 2021-01-17T05:06:13+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా 15 రోజులుగా గొబ్బెమ్మను తయారు చేసి మహిళలు ప్రతి రోజు రాత్రి వేళలో ప్రత్యేకంగా పూజలు చేశారు.

వైభవం... గొబ్బెమ్మ నిమజ్జనం
కోలాటం వేస్తున్న మహిళలు

రైల్వేకోడూరు, జనవరి, 16: సంక్రాంతి పండుగ సందర్భంగా 15 రోజులుగా గొబ్బెమ్మను తయారు చేసి మహిళలు ప్రతి రోజు రాత్రి వేళలో ప్రత్యేకంగా పూజలు చేశారు. గొబ్బి పాటలతో ప్రతి వీధిలో సందడి వాతారవరణం ఉండేది. శనివారం మహిళలు కోలాటాలు, గొబ్బిపాటలు ఆలపిస్తూ గుంజననదిలో వైభవంగా నిమజ్జనం చేశారు. బలిజవీధిలో మహిళలు గొబ్బెయాళ్లో, గొబ్బియాళ్లో గట్టుమీద రామచిలుక అంటూ పాటలు పాడుకుంటూ గొబ్బెమ్మను ప్రత్యేక వాయిద్యాలతో గుంజననదిలో నిమజ్జనం చేశారు. గుంజననది వద్ద మహిళలు ప్రసాదాలు పంపిణీ చేశారు. గొబ్బెమ్మను ప్రత్యేకండా అలంకరించారు. చిన్న పిల్లలు ఉత్సాహంగా కోలాటాలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దీంతో సంక్రాంతి పండుగ ముగిసింది.

Updated Date - 2021-01-17T05:06:13+05:30 IST