వైభవం.. సీతారాముల పట్టాభిషేకం

ABN , First Publish Date - 2021-03-01T05:02:10+05:30 IST

రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. తిరుక్కల్యాణోత్సవం, రథాయాత్ర ముగింపును పురస్కరించుకుని సీతారాముల పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు.

వైభవం.. సీతారాముల పట్టాభిషేకం
సీతారాముల పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

నెల్లిమర్ల, ఫిబ్రవరి 28: రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఆదివారం  వైభవంగా జరిగింది. తిరుక్కల్యాణోత్సవం, రథాయాత్ర ముగింపును పురస్కరించుకుని సీతారాముల పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ తంతును ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయిరామా చార్యులు, ఖండవిల్లి కిరణ్‌కుమార్‌, స్థానాచార్యులు గొడవర్తి నరసింహాచార్యులు ఘనంగా నిర్వహించారు. రుత్విక్‌లు పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు పర్యవేక్షించారు. యాగశాలలో అగ్ని ప్రతిష్టాపనం, పూర్ణాహుతి కూడా నిర్వహించారు. . ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం, అర్చన, బాలభోగం, మంగళాశాసనం తదితర పూజలు జరిగాయి. 


Updated Date - 2021-03-01T05:02:10+05:30 IST