బిజ్‌వాసన్‌ రైల్వే ప్రాజెక్ట్‌పై జీఎంఆర్‌, ఎల్‌ అండ్‌ టీ ఆసక్తి

ABN , First Publish Date - 2021-04-19T05:59:37+05:30 IST

ఢిల్లీలోని బిజ్‌వాసన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఖాళీ స్థలాల అభివృద్ధికి జీఎంఆర్‌, ఎల్‌ అండ్‌ టీ సహా మొత్తం 13 సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌...

బిజ్‌వాసన్‌ రైల్వే ప్రాజెక్ట్‌పై  జీఎంఆర్‌, ఎల్‌ అండ్‌ టీ ఆసక్తి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బిజ్‌వాసన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఖాళీ స్థలాల అభివృద్ధికి జీఎంఆర్‌, ఎల్‌ అండ్‌ టీ సహా మొత్తం 13 సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎ్‌సడీసీ) వెల్లడించింది. బిజ్‌వాసన్‌ రైల్వే స్టేషన్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 18 వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఐఆర్‌ఎ్‌సడీసీ.. లీజుకు ఇస్తోంది. దీనికి సంబంధించి ప్రీ-బిడ్‌ కన్సల్టేషన్‌ను నిర్వహించగా ఇందులో 13 సంస్థలు పాలుపంచుకున్నాయని పేర్కొంది. 18 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఎనిమిది ఖాళీ స్థలాలను మిక్స్‌డ్‌-యూజ్‌ డెవల్‌పమెంట్‌ కోసం ఆసక్తి కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ స్థలంలో దాదాపు 50,233 చదరపు మీటర్ల బిల్ట్‌-అప్‌ ఏరియాను అభివృద్ధి చేయవచ్చని తెలిపింది. 


Updated Date - 2021-04-19T05:59:37+05:30 IST