కరోనా కేసులు.. 538

ABN , First Publish Date - 2020-09-29T10:33:38+05:30 IST

జిల్లాలో తాజాగా 538 మందికి కరోనా వైరస్‌ సోకింది. సోమవారం ఉదయం వరకు 6,079 శాంపిల్స్‌ అందగా వాటిల్లో 8.85 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది.

కరోనా కేసులు.. 538

8.85 శాతం మందికే పాజిటివ్‌

గుంటూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాజాగా 538 మందికి కరోనా వైరస్‌ సోకింది. సోమవారం ఉదయం వరకు 6,079 శాంపిల్స్‌ అందగా వాటిల్లో 8.85 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. 5,541 మందికి నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. ఇప్పటి వరకు జిల్లాలో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 55,401కి చేరుకున్నది. సోమవారం కరోనాతో నలుగురు చనిపోగా జిల్లాలో మృతుల సంఖ్య 586కు పెరిగింది.


రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోండటం కొంత ఊరట కలిగిస్తోన్నది. సోమవారం వరకు రికవరీ రేటు 82.77 శాతంగా నమోదైంది. తాజాగా గుంటూరు నగరంలో 57, మంగళగిరిలో 33, తాడేపల్లిలో 22, సత్తెనపల్లిలో 18, ప్రత్తిపాడులో 17, ఫిరంగిపురంలో 10, నరసరావుపేటలో 75, చిలకలూరిపేటలో 31, యడ్లపాడులో 29, నాదెండ్లలో 10, రొంపిచర్లలో 11, వినుకొండలో 17, తెనాలిలో 30, చెరుకుపల్లిలో 32, భట్టిప్రోలులో 15, బాపట్లలో 18, దుగ్గిరాలలో 13, పొన్నూరులో 19 మందికి వైరస్‌ సోకింది. మిగిలిన మండలాల్లో మరో 81 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-09-29T10:33:38+05:30 IST