Advertisement

కేళీలపై ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

Oct 27 2020 @ 02:21AM

పరిశోధనా కేంద్రం నుంచే సరఫరాపై ఆగ్రహం


గుంటూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మంజీరా వరి బీపీటీ 5204 సాగు చేసేందుకు ఏపీ సీడ్స్‌ నుంచి విత్తనాలను కొనుగోలు చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆశ నిరాశగా మారింది. ఫిరంగిపురం మండలం వేమవరంలో  బీపీటీ 5204 అనే రకాన్ని సాగు చేపట్టేందుకు బాపట్ల పరిశోధనా కేంద్రంలో కొనుగోలు చేశారు. బీపీటీ 5204 వరి 150 రోజులకు పంట వస్తుంది. ఎమ్మెల్యే సాగు చేసిన వరిలో ఇప్పటికే కొన్ని దిబ్బులకు కేళీ గింజలు వచ్చాయి. దీనిని పరిశీలించిన ఎమ్మెల్యే వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు ఏపీ సీడ్స్‌కు సరఫరా చేసే బాపట్ల వరి పరిశోదనా కేంద్రం అధికారులు ఇచ్చిన రశీదులను అందజేశారు.


ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక వర్గసభ్యుడిగా ఉన్న రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సోమవారం బాపట్ల వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటరావు నాయకత్వంలో సత్తెనపల్లి ఏడీ అమలకుమారి, ఫిరంగిపురం ఏవో రమణకుమార్‌ వేమవరంలోని ఎమ్మెల్యే పంటను పరిశీలించారు. రెండు రోజుల్లో తన నివేదికను అందజేస్తుందని అధికారులు సోమవారం రాత్రి ఫోన్‌లో తెలిపారు.వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోదనా కేంద్రం, ఏపీ సీడ్స్‌, వ్యవపాయశాఖ, విత్తన ధృవీకరణ సంస్థల పర్యవేక్షణలో తయారయ్యే విత్తనాల్లోనే కల్తీలు వస్తే ఇక సామాన్య రైతుల పరిస్థిఇతి ఏమిటని ఎమ్మెల్యే ఆర్కే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.