2 నుంచి ఎన్నారైలో అన్ని సేవలు

ABN , First Publish Date - 2020-10-27T07:53:58+05:30 IST

చినకాకాని ఎన్నారై వైద్యశాలలో వచ్చే నెల 2వ తేదీ నుంచి అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ఎన్నారై అకాడమి అధ్యక్షుడు డాక్టర్‌ ఉపేంద్రనాథ్‌ నిమ్మగడ్డ తెలిపారు.

2 నుంచి ఎన్నారైలో అన్ని సేవలు

మంగళగిరి రూరల్‌, అక్టోబరు 26: చినకాకాని ఎన్నారై వైద్యశాలలో వచ్చే నెల 2వ తేదీ నుంచి  అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ఎన్నారై అకాడమి అధ్యక్షుడు డాక్టర్‌ ఉపేంద్రనాథ్‌ నిమ్మగడ్డ తెలిపారు. ఆరు నెలల నుంచి కొవిడ్‌ ఆసుపత్రిగా మారడంతో సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సాధారణ వైద్యసేవలు అందించేందుకు అనుమతించనట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2020-10-27T07:53:58+05:30 IST