వెట్టి నుంచి విముక్తికే.. ముష్కాన్‌

ABN , First Publish Date - 2020-10-29T11:23:21+05:30 IST

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి బాలలను, వెట్టిచాకిరిలో ఉన్న వారిని, అనాఽథలు, బాలకార్మికుల సంరక్షణ లక్ష్యంగా ఆపరేషన్‌ ముష్కాన్‌ నిర్వహిస్తున్నట్లు సౌత్‌ కోస్టల్‌ జోనల్‌ ఐజీ త్రివిక్రమ్‌వర్మ తెలిపారు.

వెట్టి నుంచి విముక్తికే.. ముష్కాన్‌

8,200 మంది వీధి బాలల సంరక్షణ : ఐజీ

నారాకోడూరులో తనిఖీలు నిర్వహించిన అర్బన్‌ ఎస్పీ


నరసరావుపేట లీగల్‌, అక్టోబరు 28:  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి బాలలను, వెట్టిచాకిరిలో ఉన్న వారిని, అనాఽథలు, బాలకార్మికుల సంరక్షణ లక్ష్యంగా ఆపరేషన్‌ ముష్కాన్‌ నిర్వహిస్తున్నట్లు సౌత్‌ కోస్టల్‌ జోనల్‌ ఐజీ త్రివిక్రమ్‌వర్మ తెలిపారు. ఆపరేషన్‌ ముష్కాన్‌లో భాగంగా బుఽధవారం పట్టణంలోని దిశ పోలీసు స్టేషన్‌ ఎదుట నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్‌ ముష్కాన్‌లో 8,200 మంది వీధి బాలలను సంరక్షించామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు రవిచంద్ర, ఎం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఐజీ మొదటి పట్టణ పోలీసు స్టేషన్‌లో రికార్డులను తనిఖీ చేశారు.  


చేబ్రోలు: మండలంలోని నారాకోడూరు లక్ష్మీ గోదావరి స్పినింగ్‌ మిల్‌, లలీత పరమేశ్వరి స్పినింగ్‌ మిల్లులో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఆపరేషన్‌ ముష్కాన్‌ను నిర్వహించారు. మిల్లులో పనిచేస్తున్న 37 మంది బాలలను గుర్తించి మిల్లులపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కమలాకరరావు, సీఐ మధుసూదనరావు, ఎస్‌ఐ కిషోర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T11:23:21+05:30 IST