UAE-India travel: ప్రయాణికులకు 'గో ఎయిర్' గుడ్‌న్యూస్.. ఇరుదేశాల మధ్య భారీగా పెరిగిన విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2022-04-05T16:25:32+05:30 IST

ఇండియన్ ఎయిర్‌లైన్ గో ఎయిర్ కీలక ప్రకటన చేసింది.

UAE-India travel: ప్రయాణికులకు 'గో ఎయిర్' గుడ్‌న్యూస్.. ఇరుదేశాల మధ్య భారీగా పెరిగిన విమాన సర్వీసులు

అబుదాబి: ఇండియన్ ఎయిర్‌లైన్ గో ఎయిర్ కీలక ప్రకటన చేసింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్‌కు రోజువారీ విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత్‌లోని ముంబై, కన్నూర్, ఢిల్లీ నగరాలకు ఈ విమాన సర్వీసులు నడపనున్నట్లు అబుదాబి ఎయిర్‌పోర్ట్ వెల్లడించింది. 2022 సమ్మర్‌కు యూఏఈ నుంచి ఈ మూడు గమ్యస్థానాలకు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయని, ప్రయాణికుల డిమాండ్ మేరకు విమాన సర్వీసులు పెంచినట్లు పేర్కొంది. ఇదిలాఉంటే.. మార్చి 27 నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంతో ఇండియా-యూఏఈ మధ్య ప్రయాణాలు భారీగా పెరిగినట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. 


దీనికితోడు యూఏఈ కరోనా నిబంధనలను సడలించడం కూడా ఇరు దేశాల మధ్య ప్రయాణాలకు మరింత ఊతమిచ్చింది. ఇక భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన తర్వాత నుంచి వీక్లీ నడిచే విమానాల సంఖ్య 3,250కు చేరింది. 66 విమానయాన సంస్థలు రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కూడా పూర్తిస్థాయిలో భారత్‌కు విమాన సర్వీసులను పునరుద్ధరించింది. ప్రస్తుతం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ వారానికి 170 విమాన సర్వీసులు నడిపిస్తోంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ ఎయిర్ క్రాఫ్ట్ 'ఎయిర్ బస్ ఏ-380'ను ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ దుబాయ్ నుంచి ముంబైకి నడిపిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా డైలీ నడిపిస్తోంది.    

Updated Date - 2022-04-05T16:25:32+05:30 IST