వేటకు వెళ్లి..

ABN , First Publish Date - 2021-11-30T04:53:37+05:30 IST

చేపల వేట ఆధారంగా బతుకుతున్న ఆ మత్స్యకారుడు విశాఖకు కుటుంబాన్ని వలస తీసుకువెళ్లాడు. అక్కడి నుంచే రోజూ సంద్రంపైకి వేటకు వెళ్తుండేవాడు. ఈ నెల 15న కూడా తన బృందంతో సముద్రంలోకి వెళ్లాడు. చేపలను వేటాడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాడు.

వేటకు వెళ్లి..
గల్లంతైన మత్స్యకారుడు ఎల్లయ్య(ఫైల్‌)

సముద్రంలో మత్స్యకారుని గల్లంతు

పూసపాటిరేగ, నవంబరు 29: చేపల వేట ఆధారంగా బతుకుతున్న ఆ మత్స్యకారుడు విశాఖకు కుటుంబాన్ని వలస తీసుకువెళ్లాడు. అక్కడి నుంచే రోజూ సంద్రంపైకి వేటకు వెళ్తుండేవాడు. ఈ నెల 15న కూడా తన బృందంతో సముద్రంలోకి వెళ్లాడు. చేపలను వేటాడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాడు. తోటి మత్స్యకారులు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కొల్లాయివలస పంచాయతీ పరిధిలోని పులిగెడ్డ గ్రామానికి చెందిన మత్స్యకారుడు కేసం ఎల్లయ్య పరిస్థితి ఇది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మత్స్యకారుడు కేసం ఎల్లయ్య ఈనెల 15వ తేదీన సాయంత్రం విశాఖ పోర్టు నుంచి బోటుపై మొత్తం 10 మంది మత్స్యకారులతో కలిసి చేపలవేటకు వెళ్లారు. చాలా రోజులు వేట సాగించారు. 27వ తేదీన ఆయన గల్లంతైనట్లు కుటుంబానికి సమాచారం అందింది. సోమవారం విషయాన్ని మత్స్యకార నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎల్లయ్యతో పాటు బోటులో ఉన్నవారంతా సోమవారం రాత్రి విశాఖకు తరలివచ్చినట్లు సమాచారం. ఎల్లయ్యకు భార్య నూకాలమ్మ, కుమారుడు రాజు(15), కుమార్తె దేవి(10) ఉన్నారు. గత్లంతైన మత్స్యకారుని గురించి జిల్లా మత్యకార సంఘం నాయకులు బర్రి చిన్నప్పన్నతోపాటు, డైరెక్టర్‌ అమర ఎర్రయ్యలు మత్స్యకారుల బోటు అసోషియేషన్‌తో చర్చిస్తున్నారు.



Updated Date - 2021-11-30T04:53:37+05:30 IST