రేషనలైజేషన్‌ జీవో 25ను ప్రభుత్వం రద్దు చేయాలి

Sep 26 2021 @ 00:03AM
నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు

- తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ డిమాండ్‌

కాకతీయకాలనీ, సెప్టెంబరు 25 : పాఠశాల విద్యలో ప్రమాణాలను, స్కూళ్లను కుదించే రేషనలైజేషన్‌ జీవో 25ను రద్దు చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు లింగారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరచాలని కోరారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు శనివారం వరంగల్‌ విద్యా పరిరక్షణ కమటీ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు అధ్యక్షతన వరంగల్‌, హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆయా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాలకుమార్‌, ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే, జి.వెంకటేశ్వర్లు, మహేందర్‌రెడ్డి, బోగేశ్వర్‌, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: