పేద విద్యార్థులను చదువులకు దూరం చేసేందుకే జీవో 77

ABN , First Publish Date - 2021-01-16T06:28:25+05:30 IST

పేద విద్యార్థులను చదువులకు దూరం చేయడానికే రాష్ట్రప్రభుత్వం జీవో-77ను ప్రవేశపెట్టిందని ఆల్‌ ఇండియా ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుప్రసాద్‌ మం డిపడ్డారు.

పేద విద్యార్థులను చదువులకు దూరం చేసేందుకే జీవో 77


- ఆల్‌ ఇండియా ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుప్రసాద్‌


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి15 : పేద విద్యార్థులను చదువులకు దూరం చేయడానికే రాష్ట్రప్రభుత్వం జీవో-77ను ప్రవేశపెట్టిందని ఆల్‌ ఇండియా ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుప్రసాద్‌ మం డిపడ్డారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు అన్నీ ఉచితంగా తమ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన సీఎం జగన్‌ ఇప్పుడు జీవో నెం-77ను తీసుకువచ్చి మాట తప్పారన్నారు. పీజీ చేస్తున్న విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను ఎత్తేస్తూ ప్రత్యేకంగా జీవోను తీసుకురావడం బాధాకరమన్నారు. సీఎం జగన్‌కు పేద విద్యార్థుల పట్ల ఏ మా త్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే జీవో నెం 77ను రద్దు చే యాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మందల శాంతకుమార్‌, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మద్దల చెరువు వెంకీ, మ ల్లెల జగదీష్‌, ఎల్లార్తి చంద్రశేఖర్‌, మల్లికార్జున, రా మాంజనేయులు, రంజిత్‌, ఓబుళపతి, సోమన్న, శేషు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T06:28:25+05:30 IST