గోవా శాసన సభ ఎన్నికలు : ఆప్ రెండో జాబితా విడుదల

Published: Sun, 09 Jan 2022 16:22:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గోవా శాసన సభ ఎన్నికలు : ఆప్ రెండో జాబితా విడుదల

న్యూఢిల్లీ : గోవా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆదివారం విడుదల చేసింది. తాము సుపరిపాలన తీసుకొస్తామని హామీ ఇచ్చింది. గోవా ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపింది. ఈ జాబితాలో 10 మంది అభ్యర్థుల పేర్లు, వారు పోటీ చేసే నియోజకవర్గాలను తెలిపింది. ఆప్ గోవా యూనిట్ కన్వీనర్ రాహుల్ మంబ్రే ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు. 


గోవా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆప్ శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా 10 మంది అభ్యర్థుల పేర్లు, వారు పోటీ చేసే నియోజకవర్గాలను తెలిపింది. ఉత్తర గోవా, దక్షిణ గోవా ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. 


కాంగ్రెస్ కూడా 10 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను విడుదల చేసింది. గోవాలో 40 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.