Goa Drug Case.. ఎడ్విన్ అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

ABN , First Publish Date - 2022-09-26T17:21:38+05:30 IST

గోవా డ్రగ్స్ కేసు (Goa Drug Case)లో హైదరాబాద్ పోలీసులు వర్సెస్ గోవా కాప్స్‌గా ఉంది.

Goa Drug Case.. ఎడ్విన్ అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

హైదరాబాద్ (Hyderabad): గోవా డ్రగ్స్ కేసు (Goa Drug Case)లో హైదరాబాద్ పోలీసులు వర్సెస్ గోవా కాప్స్‌గా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  కింగ్ పింగ్ డి సౌజా (De Souza)ని హైదరాబాద్ పోలీసులు ఆరెస్ట్  చేశారు. తాజాగా  ఎడ్విన్ (Edwin) అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎడ్విన్ అరెస్టుపై హైదరాబాద్ పోలీసులు.. గోవా పోలీసులను సంప్రదించారు. ఎడ్విన్ ఉంటున్న ఇంటి వద్దకు హైదరాబాద్ పోలీసులు వెళ్ళారు. అయితే ఎడ్విన్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ ఆయన అనుచరులు పోలీసులకు రిపోర్ట్ చూపించారు. దీంతో పోలీసులు ఆ రిపోర్ట్ ఇచ్చిన  ల్యాబ్‌కు వెళ్లి వెరిఫై చేశారు. అది ఫేక్ పాజిటివ్ రిపోర్ట్‌గా తేల్చారు. ఇదే విషయాన్ని  హైదరాబాద్ పోలీసులు.. గోవా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అది ఫేక్ రిపోర్టు అని తామే కనిపెట్టామని, ఎడ్విన్‌పై ఫోర్జరీ కేస్ నమోదు చేసి నట్లు గోవా పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-09-26T17:21:38+05:30 IST