గోవాలో కన్నడ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు

ABN , First Publish Date - 2021-11-10T17:18:57+05:30 IST

గోవాలో కన్నడ భవన నిర్మాణానికి రూ. 10 కోట్లను మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. బెంగళూరులోని తన అధికార నివాసంలో మంగళవారం ఆ

గోవాలో కన్నడ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు

                    - Cm బసవరాజ్‌ బొమ్మై భరోసా 


బెంగళూరు(Karnataka): గోవాలో కన్నడ భవన నిర్మాణానికి రూ. 10 కోట్లను మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. బెంగళూరులోని తన అధికార నివాసంలో మంగళవారం ఆయన అఖిల గోవా కన్నడ మహాసంఘం పదాధికారులతో సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సారథ్యంలో పదాధికారులు గోవాలో కన్నడిగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన వేలాది మంది కన్నడిగులు గోవాలో స్థిరపడ్డారని, సరిహద్దులో కన్నడ భాషా సంస్కృతుల వికాసానికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. కన్నడ భవన నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించి డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌)ను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నివేదిక పూర్తవుతూనే కన్నడ భవన నిర్మాణానికి రూ.10 కోట్లను విడుదల చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గోవా కన్నడ మహాసంఘం గౌరవ అధ్యక్షుడు సిద్ధణ్ణ మేటి, అధ్యక్షుడు హనుమంతరెడ్డి శిరూర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-11-10T17:18:57+05:30 IST