గుడివాడలో గోవా కల్చర్.. ABNకి చిక్కిన ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్‌

ABN , First Publish Date - 2022-01-18T02:31:41+05:30 IST

గుడివాడలో గోవా కల్చర్ వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ ప్రాంగణంలో యదేచ్ఛగా..

గుడివాడలో గోవా కల్చర్.. ABNకి చిక్కిన ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్‌

కృష్ణా: గుడివాడలో గోవా కల్చర్ వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ ప్రాంగణంలో యదేచ్ఛగా జూద క్రీడలు జరిగాయి. కోడి పందాలు, పేకాట శిబిరాలు, గుండాట, ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారు. రూ. 10 వేలు చెల్లిస్తేనే క్యాసినోలోకి ఎంట్రీ పెట్టారు. చీర్ గాల్స్‌తో నృత్యాలు కూడా చేయించారు. తీన్ పత్తా, క్యాసియోన్, మూడు ముక్కలాటలు కూడా నిర్వహించారు. ఈ తతంగం బయటకు పొక్కకుండా హైదరాబాద్‌కు చెందిన బౌన్సర్లతో లోపల నిఘా పెట్టారు. ఇక్కడ కార్డులు పంచేది.. బెట్టింగ్ చిప్స్ పంచేది అమ్మాయిలే. వీరంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారే..అన్నీ తామే అయి జూదశాలలను నడిపించారు. కేసినో లుక్‌కు స్పెషల్ అట్రాక్షన్ తెచ్చేందుకే మహిళలను దిగుమతి చేశారు. గుడివాడ క్యాసినోలో అమ్మాయిల యవ్వారంకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్‌ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కాయి. 


Updated Date - 2022-01-18T02:31:41+05:30 IST