భూఅక్రమాల కేసులు సిట్‌కు బదిలీ చేసిన Goa ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-24T20:53:24+05:30 IST

గోవా ప్రభుత్వం(Goa Govt) కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూఅక్రమాల(land irregularities)కు సంబంధించిన కేసులన్నింటినీ నూతనంగా ఏర్పాటు చేసిన సిట్(Special Investigation Team)కు బదిలీ చేయాలని నిర్ణయించింది.

భూఅక్రమాల కేసులు సిట్‌కు బదిలీ చేసిన Goa ప్రభుత్వం

పనాజీ : గోవా ప్రభుత్వం(Goa Govt) కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూఅక్రమాల(land irregularities)కు సంబంధించిన కేసులన్నింటినీ నూతనంగా ఏర్పాటు చేసిన సిట్(Special Investigation Team)కు బదిలీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ జస్పాల్ సింగ్(Jaspal Singh) ప్రకటించారు. భూమి రిజిస్ట్రేషన్‌లో మోసాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. భూమి మోసాలపై ప్రజలు ధైర్యంగా నొరువిప్పి ఫిర్యాదు చేసేందుకుగానూ సిట్‌ను ఏర్పాటు చేసినట్టు సింగ్ వివరించారు. కేసు దర్యాప్తుతోపాటు ఆచరణలో ఉన్న చట్టాలకు అవసరమైన సవరణలపై సిట్ సిఫార్సులు చేస్తుందని ఆయన తెలిపారు. తద్వారా భవిష్యత్‌లో భూఅక్రమాలను అడ్డుకోగలుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.


భూఆక్రమణలు, చట్టవిరుద్ధంగా భూముల బదిలీలపై దర్యాప్తునకు గోవా ప్రభుత్వం ఇటివలే సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ సిట్‌కు క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ నిధిన్ వల్సన్ నేతృత్వం వహిస్తున్నారు. పురావస్తు విభాగం, రాష్ట్ర రిజిస్ట్రార్ ఈ సిట్‌లో సభ్యులుగా ఉంటారు.


మరోవైపు నకిలీ పత్రాలను ఉపయోగించి గోవాలో 60-70 ఆస్తులను చట్టవిరుద్ధంగా బదిలీ చేసిన కర్ణాటక వ్యక్తిని సిట్ ఇటివలే అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. భూఅక్రమాలు, మోసాలతో సంబంధమున్న పలువురు ప్రభుత్వాధికారులు కూడా అరెస్టయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-06-24T20:53:24+05:30 IST