ఉత్పల్‌ పర్రీకర్‌కు టికెట్‌ నిరాకరణ

Published: Fri, 21 Jan 2022 02:37:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉత్పల్‌ పర్రీకర్‌కు టికెట్‌ నిరాకరణ

  గోవా ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా

న్యూఢిల్లీ/పణజి, జనవరి 20: గోవా అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌.. సాంక్వెలిమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గోవా మాజీ సీఎం, దివంగత మనోహర్‌ పర్రీకర్‌ కుమారుడు ఉత్పల్‌ పర్రీకర్‌కు నిరాశ ఎదురైంది. పణజి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న ఉత్పల్‌కు బీజేపీ టికెట్‌ కేటాయించలేదు. ఆ టికెట్‌ను అటానాసియో మోన్సెరేట్‌కు పార్టీ కేటాయించింది. ప్రస్తుతం ఆయన పణజిలో సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా ఉత్పల్‌కు తాము టికెట్‌ ఇస్తామని ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.