లక్ష్యాలు చేరుకోవాల్సిందే

ABN , First Publish Date - 2022-05-25T05:44:36+05:30 IST

‘సమస్యలను అధిగమిస్తూ.. లక్ష్యాలను చేరుకోవాలి. లేకపోతే సహించేది లేదు’ అంటూ కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌ అధికారులను హెచ్చరించారు. మంగళవారం కె.కొత్తూరులోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో టెక్కలి, పలాస డివిజన్ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలకు దూరంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్ష్యాలు చేరుకోవాల్సిందే
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
- నందిగాం గృహ నిర్మాణ శాఖ ఏఈ సస్పెన్షన్‌కు ఆదేశం
(టెక్కలి)

‘సమస్యలను అధిగమిస్తూ.. లక్ష్యాలను చేరుకోవాలి. లేకపోతే సహించేది లేదు’ అంటూ కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌ అధికారులను హెచ్చరించారు. మంగళవారం కె.కొత్తూరులోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో టెక్కలి, పలాస డివిజన్ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలకు దూరంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగాం మండలంలోని జగనన్న ఇళ్ల కాలనీల గ్రౌండింగ్‌లో తాత్సారం చేస్తున్న ఏఈ కె.ఆనంద్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని గృహనిర్మాణశాఖ పీడీ నక్క గణపతిరావుకు ఆదేశించారు. ‘ఉపాధిహామీ వేతనదారులు రోజువారీ కూలీ రూ.150కే పరిమితమవుతున్నారు. రూ.250 వరకు వేతనాలు అందించే దిశగా చర్యలు చేపట్టాలి. హిరమండలం, టెక్కలి, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, కొత్తూరు, నందిగాం మండలాల్లో  ఉపాధిహామీ పనుల్లో వేతనదారుల సంఖ్య పెంచాలి. జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలి. గ్రామాల్లో రెవెన్యూ రీసర్వే లక్ష్యాలు పూర్తిచేయాలి. నీటితీరువా వసూళ్లు చేపట్టాలి. ‘స్పందన’లో వచ్చిన అర్జీలు నిర్ణీత గడువులో పరిష్కరించండి. ఇంటింటికీ తాగునీటి కొళాయిలు వేగవంతం చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించి.. లక్ష్యాలను చేరుకోవాలి’ అని కలెక్టర్‌ స్పష్టం చేశారు.  సమావేశంలో జేసీ విజయసునీత, టెక్కలి, పలాస ఆర్డీవోలు హనుమంతు జయరాం, సీతారామరాజు, జడ్పీ సీఈవో బెందాళం లక్ష్మీపతి, డీపీఓ విజయకుమార్‌, గృహనిర్మాణశాఖ పీడీ నక్క గణపతిరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:44:36+05:30 IST