విచిత్ర జీవికి జన్మనిచ్చిన మేక... వింతగా చూస్తూ జనం పూజలు!

ABN , First Publish Date - 2020-11-25T12:52:36+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మేక... కోతిముఖం కలిగి, మనిషిని పోలిన...

విచిత్ర జీవికి జన్మనిచ్చిన మేక... వింతగా చూస్తూ జనం పూజలు!

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మేక... కోతిముఖం కలిగి, మనిషిని పోలిన విచిత్ర జీవికి జన్మనిచ్చింది. అక్కడున్నవారంతా ఆ రూపాన్ని హనుమంతునిగా భావిస్తూ పూజలు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఆ వింతజీవి జన్మించిన కొద్దిసేపటికే మృతి చెందింది. అయినా ఆ జీవిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.


కొంతమంది దానికి దండాలు పెడుతూ, దానిపై డబ్బులు వేశారు. కాన్పూర్‌లోని జహంగీరాబాద్‌నివాసి సీతారామ్‌కు చెందిన ఒక మేక విచిత్ర జీవికి జన్మనిచ్చింది. దానిని చూసిన సీతారామ్ ఆశ్చర్యపోయాడు. క్షణాల్లోనే ఈ వార్త ఊరంతా పాకిపోయింది. చూస్తుండగానే సీతారామ్ ఇంటి ముందు జనసందోహం నెలకొంది. వారిలో కొంతమంది దానిని కలియుగంలో హనుమంతుని అవతారం అంటూ వదంతులు సృష్టించారు. దీంతో ఆ వింతజీవికి స్థానికులు పూజలు చేయడం ప్రారంభించారు.  కొద్ది సేపటి తరువాత ఆ వింతజీవిని ఖననం చేశారు.



Updated Date - 2020-11-25T12:52:36+05:30 IST