మేక పాల కోసం ఎగబడుతున్న అక్కడి జనం.. లీటర్ ఏకంగా రూ.500.. ఇంత డిమాండ్‌కు అసలు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-10-11T23:29:13+05:30 IST

శ్రేష్ఠమైన పాలు బలవర్ధక ఆహారం అన్న విషయం మనందరికీ తెలిసిందే. స్వచ్ఛమైన లీటరు పాలు సాధారణంగా మార్కెట్‌లో యాభై నుంచి అరవై రూపాయలకు లభిస్తాయి. అందులోనూ గేదె పాలకే కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే మేక పాల విషయానికి వస్తే.. వీటికి అంతగా గిరాకీ ఉండదు. కొన్ని ప్రాంతాల్లో మేక పాలను ఫ్రీగా ఇచ్చినా ఎవరూ తీసుకోరు. కానీ గేద పాలు అందుబా

మేక పాల కోసం ఎగబడుతున్న అక్కడి జనం.. లీటర్ ఏకంగా రూ.500.. ఇంత డిమాండ్‌కు అసలు కారణమేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: శ్రేష్ఠమైన పాలు బలవర్ధక ఆహారం అన్న విషయం మనందరికీ తెలిసిందే. స్వచ్ఛమైన లీటరు పాలు సాధారణంగా మార్కెట్‌లో యాభై నుంచి అరవై రూపాయలకు లభిస్తాయి. అందులోనూ గేదె పాలకే కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే మేక పాల విషయానికి వస్తే.. వీటికి అంతగా గిరాకీ ఉండదు. కొన్ని ప్రాంతాల్లో మేక పాలను ఫ్రీగా ఇచ్చినా ఎవరూ తీసుకోరు. కానీ గేద పాలు అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం లీటరుకు రూ.50 వరకూ వెచ్చించి మేక పాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంతకూ ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. మన దేశంలోని ఓ ప్రాంతంలో మేక పాలకు డిమాండ్ పీక్స్‌లో ఉంది. ఈ పాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంత వెచ్చించడానికైనా వెనకాడటం లేదు. లీటరుకు రూ. 500 చెల్లించి మరీ మేక పాలను కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ మేక పాలు దొరకకపోవడంతో.. తీవ్ర నిరాశ గురవుతున్నారు. కాగా.. అక్కడ మేక పాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే..



హర్యానాలోని నుహ్ జిల్లా ప్రజలు మేక పాలను ఎగబడి మరీ కొంటున్నారు. లీటరు మేక పాలకు రూ.500 చెల్లించేందుకూ సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ పాలు దొరకకపోవడంతో.. మేకపాలు పుష్కలంగా లభించే చుట్టుపక్కల ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ మేక పాలను ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఆ పాలు అంటే వాళ్లకు ఎందుకు అంత వెర్రి అని అనుకోకండి. ఆ జిల్లా ప్రజలు మేక పాల వేటలో పడటానికి పెద్ద కారణమే ఉంది. అదేంటే.. నుహ్ జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. వందలాది డెంగ్యూ కేసులు అక్కడ నమోదవుతున్నాయి. డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరపోయినన్ని పడకలు అందుబాటులో లేకపోవడంతో.. పక్క జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడక్కడ నెలకొంది. 



ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు.. డెంగ్యూ నుంచి బయటపడేందుకు మేక పాలు బాగా ఉపకరిస్తాయని బలంగా నమ్ముతున్నారు. మేక పాలను తాగడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. దీంతో మేక పాల కోసం అక్కడి ప్రజలు ఎగబడుతున్నారు. రూ.400-రూ.500 చెల్లించి మరీ లీటరు పాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే మేక పాల ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని డాక్టర్లు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డెంగ్యూ నేపథ్యంలో పపాయ, కివీ వంటి పండ్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీ పపాయ రూ.100 పలుకుతుండగా.. కిలో కివీ పండ్ల ధర అమాంతం రూ.400లకు చేరింది. 




Updated Date - 2021-10-11T23:29:13+05:30 IST