ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు : జూలకంటి

ABN , First Publish Date - 2022-05-17T06:53:59+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరస్పర ఆరోపణలతో పబ్బం గడుపుతున్నా యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రిం చడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ సెక్టార్లను అమ్ముకుం

ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు : జూలకంటి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి

మిర్యాలగూడ అర్బన్‌, మే 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరస్పర ఆరోపణలతో పబ్బం గడుపుతున్నా యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రిం చడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ సెక్టార్లను అమ్ముకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో సమాన్యుడు బతకలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విస్మరించింద న్నారు. సమావేశంలో వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్‌, బావండ్ల పాండు, సైదా, వినోద్‌నాయక్‌ పాల్గొన్నారు.

ఫ యాదాద్రి థర్మల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం భూములు కోల్పో యిన వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. బాధిత రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు సోమ వారం వినతిపత్రం అందజేశారు. పవర్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం, వీర్లపాలెం తదితర గ్రామాల రైతులు తమ సాగుభూములను కోల్పోయారని అన్నారు. భూ సేకరణ సమ యంలో రైతులందరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం భూపట్టేదారులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్ప డం సరికాదన్నారు. కబ్జాలో ఉండి భూములను అప్పగించిన వారం దరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళన కార్య క్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరరించారు. 

Updated Date - 2022-05-17T06:53:59+05:30 IST