సత్యదేవునికి కల్యాణం, విశ్వేశ్వరస్వామికి రుద్రాభిషేకం

ABN , First Publish Date - 2022-01-21T06:25:16+05:30 IST

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్‌86వ జయంతి వేడుకల ముగింపు సందర్భంగా గురువారం వేదపండితుడు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామికి రుద్రాభిషేకం, అర్చనలు జరిపారు.

సత్యదేవునికి కల్యాణం, విశ్వేశ్వరస్వామికి రుద్రాభిషేకం

రాయవరం, జనవరి 20: వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్‌86వ జయంతి వేడుకల ముగింపు సందర్భంగా గురువారం వేదపండితుడు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామికి రుద్రాభిషేకం, అర్చనలు జరిపారు. అనంతరం వాడపల్లి ఉదయ్‌, పెద్దింటి బలరామాచార్యులు ఆధ్వర్యంలో రమా సహిత వీరవెంకటసత్యనారాయణ స్వామి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.  అడ్మినిస్ట్రేటర్‌ వీవీ బాపిరాజు, పీఆర్వో బాబి, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు సత్య వెంకట కామేశ్వరి, భాస్కరనారాయణ, సత్యకనక దుర్గ, రమ, అర్చకుడు చీమలకొండ శ్రీనివాస్‌, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:25:16+05:30 IST