ఆలయ ప్రారంభోత్సవ గోడపత్రిక విడుదల

Published: Wed, 17 Aug 2022 22:08:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ఆలయ ప్రారంభోత్సవ గోడపత్రిక విడుదల గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న ఇందిరమ్మ, గ్రామ పెద్దలు

జలదంకి, ఆగస్టు17: మండలంలోని కమ్మపాలెంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ, మహాశీతలీతల్లి  ఆలయ ప్రారంభోత్సవ గోడ పత్రికలను  బుధవారం మాజీసర్పంచి తిప్పారెడ్డి ఇందిరమ్మ, గ్రామపెద్దలు గొట్టిపాటి కొండపనాయుడు, గొట్టిపాటి శ్రీనివాసులు, పులివర్తి సుధాకర్‌నాయుడులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20న అంకురార్పణ, హోమాలు, 21న గ్రామోత్సవం, 22న విగ్రహప్రతిష్ఠ  జరుగుతుందన్నారు. ప్రతిష్ఠ అనంతరం పూజాకార్యక్రమాలు, అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.