గోదారమ్మ పరవళ్లు

ABN , First Publish Date - 2020-09-15T10:45:47+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెకు నుంచి గోదారమ్మ పరవళ్లు పెడు తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరడంతో అధికారు లు ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులు

గోదారమ్మ పరవళ్లు

ఎస్సారెస్పీ ఎనిమిది గేట్ల ఎత్తివేత

దిగువకు 25వేల క్యూసెక్కుల నీటి విడుదల

ప్రాజెక్టులోకి 56,725 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

వరద ఆధారంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం


నిజామాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మెండోర :  శ్రీరాంసాగర్‌ ప్రాజెకు నుంచి గోదారమ్మ పరవళ్లు పెడు తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరడంతో అధికారు లు ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులు తున్నారు. మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండడంతో గడిచిన కొన్ని రోజులుగా ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. వరద ఎ క్కువగా వస్తుండడంతో నాలుగు రోజుల క్రితం వరద కాలు వ ద్వారా నీటిని మిడ్‌ మానేరుకు విడుదల చేశారు. సోమ వారం వరద మరింత పెరగడంతో గేట్లను ఎత్తి నీటిని దిగు వకు విడుదల చేశారు. ఎస్సారెస్పీలోకి 56,725 క్యూసెక్కుల వరద వస్తోంది. పాజ్రెక్టు నీటిమట్టం 1091 అడుగులకు గా ను 1090.08 అడుగులకు చేరింది. 90 టీఎంసీలకుగాను 89.212 టీఎంసీలకు చేరింది. శ్రీరాంసాగర్‌ సీఈ శంకర్‌, ఎస్‌ ఈ సుశీల్‌ దేశ్‌పాండే, ఈఈ రామారావు సోమవారం తొలు త మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నాలుగు గేట్ల ను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రాత్రి 8:30గంటలకు మరో నాలుగు గేట్లను ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశా రు. వరద మ రింత పెగితే మరి కొన్ని గేట్లను ఎత్తనున్నారు. పైనుం చి వచ్చే వరద ఆధారంగా నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.


మహారాష్ట్రలోని గోదావరిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండాయి. ఔరంగాబాద్‌ స మీపంలో ఉన్న జైక్వాడ్‌ ప్రాజెక్టు 102 టీఎంసీల కెపాసిటీ ఉండగా పది రోజుల క్రితమే నిండింది. ఆ ప్రాజెక్టు నుంచి 38 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సిద్దేశ్వర్‌, విష్ణుపురి, బాలేగాం, అందూరాతో పాటు ఇ తర ప్రాజెక్టులు నిండడంతో గేట్లను ఎత్తి నీటిని వదులుతు న్నారు. అక్కడి నుంచి వరద వస్తుండడం, ప్రాజెక్టు నిండ డంతో అధికారులు దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టు ను ంచి వరద కాలువకు 13,736 క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 5వేలు, ప్రా జెక్టు కాలువలు కాకతీయ, లక్ష్మి, సర స్వతి, గుత్ప, అలీసాగర్‌ కాలువలకు 9 వేల క్యూసెక్కుల వరకు నీటిని వుడుదల చే స్తున్నారు. ప్రాజెక్టులోకి జూన్‌ నుంచి ఇప్పటి వరకు 93 టీఎ ంసీల వరకు వరద వ చ్చింది. శ్రీరాంసాగర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్నందున ప్రజలు అందరూ అప్ర మత్తంగా ఉండాలని అధికారులు కోరారు.


దిగువన గోదావరిలో కి పశువుల మేతకు, చేప ల పట్టుకునేందుకు వెళ్లే వారు పోవద్దని కోరారు. గోదావరి వెంట ఉన్న మండలాల అధి కారులకు స మాచా రం అందించారు. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కొద్ది రోజుల వరకు గోదావరి వైపు వెళ్లవద్దని కోరా రు. మహారాష్ట్రలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడం వల్ల వరద వస్తోందని సీఈ శంకర్‌, ఎస్‌ఈ సుశీల్‌ దేశ్‌ పాండే, ఈఈ రామారావు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది గేట్లను ఎత్తామ ని తెలిపారు. ప్రాజెక్టులోకి వచ్చే వరదను బట్టి మరిన్ని గేట్ల ను తెరుస్తామన్నారు. కరోనా ఉండడం వల్ల పర్యాటకులను ప్రాజెక్టుపైకి అనుమతి ఇవ్వమని తెలిపారు. ప్రాజెక్టు వద్దకు ఎవరూ రావద్దని కోరారు. 


ఆయకట్టు రెండో పంటకు డోకా లేదు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండడంతో ఉత్తర తెలంగాణ ఆ యకట్టు రైతులకు రెండో పంటకు డోకా లేదు. ప్రాజెక్టు పరి ధిలోని నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగ ర్‌, వరంగల్‌ అర్భన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబబాద్‌ జి ల్లాలో మొత్తం అయకట్టుకు రబీలో నీళ్లు అందనున్నాయి. ప్రాజెక్టు నిండడం వల్ల గత సంవత్సరం లాగానే ఈ సంవ త్సరం కూడా పూర్తిస్థాయిలో అయకట్టు పరిధిలో సాగుకు నీరందనుంది. ఎస్సారెస్పీ పరిధిలోని మిడ్‌ మానేరు, లోయ ర్‌ మనేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నిండటం వల్ల సాగు ఎక్కు వ అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం ప్రాజెక్టు నిం డడంతో రబీలో సమారు 14 లక్షల ఎకరాల వరకు సాగునీ రు అందించారు.


ప్రస్తుతం మరో నెల రోజుల వరకే ఖరీప్‌ పంటలకు సాగుకు నీరందించనున్నారు. అప్పటివరకు పై నుంచి వచ్చే వరద సరిపోయే అవకాశం ఉందని అధికారు లు తెలిపారు. ప్రస్తుతం నిండి ఉండటం వల్ల రెండో పంట కు అదే రీతిలో పెరగనుంది. ప్రాజెక్టు పరిధిలో కరీఫ్‌లోనే జోరుగా వరిసాగు అయింది, ప్రాజెక్టు పరిధిలో సమారు 14 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేరీతిలో నీళ్లు ఉండడం వల్ల రబీలోనూ వరి సాగు గణనీయంగా పెరుగుతుందన్నారు. గత సంవత్సరం లాగానే ప్రాజెక్టు నిండడంతో అయకట్టు  రైతుల్లో సంతోషం వెళ్లి విరుస్తోంది.

Updated Date - 2020-09-15T10:45:47+05:30 IST