గోదావరిలో దూకి వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2021-07-20T05:38:58+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై నుంచి సోమవారం ఓ వ్యక్తి నదిలోకి దూకి గల్లంతయ్యాడు. బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టీనగర్‌కు చెందిన బండి రమేష్‌ అలియాస్‌ సమేలు సోమవారం గోదావరిలో దూకి గల్లంతయ్యాడు.

గోదావరిలో దూకి వ్యక్తి గల్లంతు

గాలింపు చేపట్టిన పోలీసులు

వరద ఉధృతి వల్ల లభ్యంకానీ అచూకీ

బూర్గంపాడు, జూలై 19: భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై నుంచి సోమవారం ఓ వ్యక్తి నదిలోకి దూకి గల్లంతయ్యాడు. బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టీనగర్‌కు  చెందిన బండి రమేష్‌ అలియాస్‌ సమేలు సోమవారం గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. రమేష్‌ ఐటీసీలో క్యాజువల్‌ లేబర్‌గా విధులు నిర్వహిస్తూ సారపాక పంచాయతీ పరిదిలోని గోదారమ్మ క్యాంపులో నివాసం ఉంటున్నాడు. కాగా సోమవారం మధ్యాహ్నం సమయంలో భద్రాచలం-సారపాక గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఆందించారు. రమేష్‌కు భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలున్నారు. రమేష్‌ అదృశ్యంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ జితేందర్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొన్ని గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ సరిహద్దు గ్రామాలైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏలేరు, వెంకటాపురం, రావిగూడెం గ్రామాల వరకు గాలింపు చేపట్టిన ఫలితం లేదు.  గోదావరిలో వరద ఉదృతి కారణంగా రమేష్‌ అచూకీ తెలియరాలేదని పోలీసులు సిబ్బంది తెలిపారు. దిగువ ఉన్న గ్రామాల జాలర్లకు ఈ సమాచారం ఆందజేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో సైతం ఒకసారి రమేష్‌ గోదావరిలో దూకడంతో స్థానిక జాలర్లు కాపాడినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-20T05:38:58+05:30 IST